Spy Cemera : బాత్ రూమ్‌లో స్పై కెమెరా.. షాకైన మహిళా డాక్టర్

ఓ గుర్తు తెలియని వ్యక్తి వైద్యురాలి బాత్ రూమ్ లో స్పై కెమెరా పెట్టిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే ధంకవాడి నగరంలో గల ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలు (31) పనిచేస్తున్నారు. ఆమె ఆసుపత్రికి సమీపంలోని క్వార్టర్స్‌లో మరో వైద్యుడితో కలిసి ఉంటున్నారు. మంగళవారం డ్యూటీ ముగించుకుని వచ్చిన వైద్యురాలు ఇంట్లో స్విచ్ ఆన్ చేసింది, అయినా వెలగలేదు.

Spy Cemera : బాత్ రూమ్‌లో స్పై కెమెరా.. షాకైన మహిళా డాక్టర్

Spy Cemera

Spy Cemera : ఓ గుర్తు తెలియని వ్యక్తి వైద్యురాలి బాత్ రూమ్ లో స్పై కెమెరా పెట్టిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే ధంకవాడి నగరంలో గల ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలు (31) పనిచేస్తున్నారు. ఆమె ఆసుపత్రికి సమీపంలోని క్వార్టర్స్‌లో మరో వైద్యుడితో కలిసి ఉంటున్నారు. మంగళవారం డ్యూటీ ముగించుకుని వచ్చిన వైద్యురాలు ఇంట్లో స్విచ్ ఆన్ చేసింది, అయినా లైట్ వెలగలేదు. అనంతరం బాత్ రూమ్ లోని లైట్ స్విచ్ వేసింది అది కూడా వెలగలేదు.

దీంతో ఆమె ఎలెక్ట్రిషన్ ను పిలిపించింది. ఎలెక్ట్రిషన్ లైట్లు హోల్డర్స్ తీసి చూడగా అందులో స్పై కెమెరాలు ఉన్నట్లు గుర్తించాడు. మెమోరికార్ట్ తోపాటు, స్పై కెమెరాను గుర్తించి వైద్యురాలికి తెలిపారు. దీంతో ఆమె ధంకవాడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఉండే ఇంటికి సమీపంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆగంతకుడిని గుర్తించేందుకు మరో ఆధారం ఏమైనా దొరుకుతుందేమోనని పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరా, మేమెరికార్డ్ స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఇక ఆగంతకుడి కోసం రెండు టీంలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.