Sri Krishna Birthplace : శ్రీకృష్ణుడు జన్మస్థలంగా చెబుతున్న మథుర గురించి చరిత్ర ఏం చెప్తోంది ?

రామజన్మభూమికి కోసం ఉద్యమాలు జరిగినట్లుగా..ఉత్తరప్రదేశ్ లోని మథుర శ్రీకృష్ణ జన్మస్థానం వివాదంలోనూ జరుగుతుందా..? అసలీ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. అసలు మథుర గురించి చరిత్ర ఏం చెప్తోంది.. పిటిషన్లకు ముందు ఏం జరిగింది.. అసలీ వివాదానికి పరిష్కారం చూపించడం ఇప్పట్లో సాధ్యమేనా..

Sri Krishna Birthplace : శ్రీకృష్ణుడు జన్మస్థలంగా చెబుతున్న మథుర గురించి చరిత్ర ఏం చెప్తోంది ?

Sri Krishna Janmabhoomi case in Mathura

Sri Krishna Birthplace : రామజన్మభూమికి కోసం ఉద్యమాలు జరిగినట్లుగా..ఉత్తరప్రదేశ్ లోని మథుర శ్రీకృష్ణ జన్మస్థానం వివాదంలోనూ జరుగుతుందా..? అసలీ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. అసలు మథుర గురించి చరిత్ర ఏం చెప్తోంది.. పిటిషన్లకు ముందు ఏం జరిగింది.. అసలీ వివాదానికి పరిష్కారం చూపించడం ఇప్పట్లో సాధ్యమేనా..

శ్రీకృష్ణ జన్మస్థానంగా చెప్తున్న ‘కత్రా కేశవ్‌ దేవ్’ ఆలయాన్ని… శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం చుట్టూ నిర్మించినట్లు కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను దేవకీ సోదరుడైన కంసుడు అక్కడే బందీలుగా ఉంచాడని అక్కడే శ్రీకృష్ణుడు పుట్టాడని చెబుతున్నారు. అక్కడే ఓ దేవాలయం నిర్మించారని ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో వజ్రానభుడు నిర్మించారని.. ఆ తర్వాత ఈ ఆలయాన్ని కాలక్రమేణ అనేకసార్లు తిరిగి నిర్మించారని చరిత్ర చెప్తోంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న షాహీ ఈద్గా మసీదును… 1670లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ నిర్మించారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వహించిన వేలంపాటలో 13.77 ఎకరాల భూమిని బెనారస్ రాజు రాజా పత్ని మాల్ కొనుగోలు చేశారు. 19శతాబ్దం వరకు బెనారస్ రాజు పేరుపైనే ఈ స్థలం ఉండేది. ఐతే 1935లో అల్‌హాబాద్ హైకోర్టు ఈ యాజమాన్య హక్కులను కొట్టేసింది. 10ఏళ్ల తర్వాత యుగల్ కిశోర్ బిర్లా అనే వ్యాపారి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1958లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఆలయ ట్రస్ట్ బాధ్యతలు ఈ సంఘం చూసుకుంటోంది.

Sri Krishna Birthplace : శ్రీకృష్ణ జన్మస్థల వివాదం..షాహీఈద్గా మసీదులో సర్వేలతో ఏంజరగనుంది? హిందూ,ముస్లీంల మధ్య 1968లో జరిగిన ఒప్పందం ఏంటి..?

షాహీ ఈద్గా మసీదుకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1669-70 మధ్యలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించాడు. వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చి వేసినట్లే.. షాహీ ఈద్గా మసీదు నిర్మాణం కోసం మథుర ఆలయాన్నీ కూడా ధ్వంసం చేశాడన్నది హిందూ ధార్మిక సంస్థలు వాదిస్తున్నాయ్. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికీ ఉన్నాయని అంటున్నాయ్. 1670లో షాహీ ఈద్గా మసీదుని నిర్మించినప్పుడు ఈ ప్రాంతాన్ని నాజల్‌ ల్యాండ్‌గా గుర్తించారు. అంటే ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించిన భూమి అని ! అప్పట్లో మరాఠాల అధీనంలో ఉన్న ఈ భూమి ఆ తర్వాత బ్రిటిష్‌ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగి ఇప్పుడు వివాదాలకు కారణం అవుతోంది.

పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకిలు బందీలుగా ఉన్న, శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం.. ఇప్పుడు మసీదు కింద ఉందని.. కోర్టుకెక్కిన కొంతమంది పిటిషన్‌దారులు నమ్ముతున్నారు. మసీదు కింద తవ్వడానికి కోర్టు అనుమతిస్తే చెరసాల బయటకు వస్తుందని వారు పిటిషన్లలో తెలిపారు. అలాంటిది ఇప్పుడు మథుర కోర్టు ఆదేశాలతో ఈ వివాదంలో కీలక అడుగు పడినట్లు అయింది. సర్వేతో కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయ్‌. అప్పుడు ఎవరి వాదనలో ఎంత నిజముందన్నది తేలిపోయే చాన్స్ ఉంది. శతాబ్దాలుగా బయటకు రాని నిజాలు కూడా బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయ్. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదును నిర్మించారా.. ఔరంగజేబు హయాంలో అసలేం జరిగింది.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే చారిత్రక ఆధారాలు తప్పనిసరి ! ఇప్పుడు సర్వేతో ఆ విషయాలు బయటకు వచ్చే చాన్స్ ఉంది.

Sri Krishna Janmabhoomi Row : శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మసీదు నిర్మాణం కేసు..మసీదులో సర్వే చేయాలని మ‌థుర కోర్టు తీర్పు

కృష్ణుడిని కలియుగ దైవంగా భావిస్తుంటారు చాలామంది భక్తులు. అలాంటిది ఇప్పుడు ఆయన జన్మస్థలం చుట్టూ వివాదాలు అలుపుకుంటున్నాయ్. దీంతో మథుర మరో అయోధ్యగా మారుతుందా అనే చర్చ జనాల్లో జరుగుతోంది. అయోధ్య వివాదం కొన్ని దశాబ్దాలు నడిచింది. బాబ్రీ మ‌సీదు, రామ‌జ‌న్మభూమి వాదనల‌తో అయోధ్య నిత్యం టెన్షన్ మ‌ధ్య ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య వివాదానికి ప‌రిష్కారం ల‌భించింది. భ‌వ్యమైన రామ‌మందిరాన్ని ఇప్పుడు అక్కడ నిర్మిస్తున్నారు. అయోధ్య, వారణాసి, మథుర, .. ఈ మూడూ యూపీలోనే ఉండడం హైలైట్ ! ఐతే రామజన్మభూమి వివాదానికి పరిష్కారం దొరికినట్లు.. దీనికి కూడా లభిస్తుందా.. లేదంటే ఆ వ్యవహారంలో జరిగినట్లే.. ఏళ్లకు ఏళ్లు వివాదం కొనసాగుతుందా.. సర్వే తర్వాత ఏం జరగబోతుందన్న ఆసక్తి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.