కొలంబోలో పేలుళ్లు : ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్

  • Published By: madhu ,Published On : April 21, 2019 / 08:56 AM IST
కొలంబోలో పేలుళ్లు : ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్

కొలంబోలో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. వరుస బాంబు పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో మృతి చెందుతున్నారు. మరెంతో మంది గాయాలపాలయ్యారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆరు బాంబు పేలుళ్లు జరిపారు. ఇప్పటి వరకు 185 మంది మృతి చెందారు. ఎక్కడికక్కడ మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఆర్తానాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. 

ఇదిలా ఉంటే శ్రీలంకలో ఉగ్రదాడులు జరుగుతాయని..అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఇంటెలిజెన్స్ ముందే హెచ్చరించింది. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిలెజెన్స్ ఓ నివేదిక అందచేశారు.

STJ ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని, చర్చీలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను పట్టించుకుని భద్రతా చర్యలు తీసుకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు వెల్లడిస్తున్నారు