Srilanka-India: లగ్జరీ రైలు కోసం శ్రీలంకకు సహకారం అందించిన భారత్

చైనా నుంచి తీసుకున్న అప్పులతో తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక, భారత్ సహకారంతో అభివృద్ధి పుంతలు తొక్కుతుంది.

Srilanka-India: లగ్జరీ రైలు కోసం శ్రీలంకకు సహకారం అందించిన భారత్

Srilanka

Srilanka-India: చైనాతో ఆర్ధిక వ్యూహంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు.. భారత్ అందిస్తున్న సహకారం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. చైనా నుంచి తీసుకున్న అప్పులతో తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక, భారత్ సహకారంతో అభివృద్ధి పుంతలు తొక్కుతుంది. ఈక్రమంలో శ్రీలంకలో రైలు వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు USD $3.5 బిలియన్ డాలర్లను భారత్ పెట్టుబడి పెట్టింది. ఇందులో భాగంగా అభివృద్ధి చేసిన లగ్జరీ AC రైలును శ్రీలంక ఆదివారం ఆవిష్కరించింది. శ్రీలంక రవాణాశాఖ మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, భారత డిప్యూటీ హైకమిషనర్ వినోద్ కె జాకబ్ ముఖ్యఅతిథిలుగా ఈ లగ్జరీ రైలును ఆవిష్కరించారు.

Also Read: Cholesterol : ఆ పండ్లు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయ్….

శ్రీలంకలోని తమిళ జనాభా ప్రాభల్యం ఉన్న జాఫ్నాలోని కంకేసంతురై ఓడరేవు నుంచి దేశ రాజధాని కొలంబోలోని మౌంట్ లావినియా శివారు ప్రాంతం వరకు చేపట్టిన ఈ రైలు మార్గం పొడవు మొత్తం 386 కిలోమీటర్లు ఉంటుంది. భారత్ లో రైల్వే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న RITES లిమిటెడ్, భారత ప్రభుత్వం అందించిన ఇన్ లైన్ క్రెడిట్ ఆధారంగా ఈ AC డీజిల్ మల్టిపుల్ యూనిట్(DMU)లను శ్రీలంక అభివృద్ధి చేసింది. కాగా ఏసీ రైలు కోచ్ ల అభివృద్ధి కోసం భారత్ అందించిన సహకారంపై శ్రీలంక రవాణాశాఖ మంత్రి పవిత్ర వన్నియారాచ్చి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ రైలు కోచ్ ల అభివృద్ధి లభించిందని ఆమె అన్నారు.

Also read: Love Marriage : ప్రేమ వివాహం చేసుకుందని, పోలీసుస్టేషన్‌లో చెల్లెలిపై దాడి చేసిన అన్న