Jammu Kashmir: తిరిగి తెరుచుకున్న శ్రీనగర్-జమ్మూ హైవే.. విమానాలకు కూడా పచ్చ జెండా

ప్రస్తుతం ఉదయం పూట 3,000 మాటర్ల దూరం వరకు బాగానే కనిపిస్తుందని, దీంతో పెద్ద ఇబ్బుందులేమీ ఉండవు. కశ్మీర్ లోయకు చేరుకోవడానికి జమ్మూ-శ్రీనగర్ మాత్రమే ఏకైక మార్గం. కొద్ది రోజులుగా హిమపాతంతో మూసుకుపోయిన ఈ రోడ్డు, శుక్రవారం సాయంత్రానికి హిమపాతం తగ్గడంతో శనివారం తిరిగి తెరుచుకుంది. శ్రీనగర్‭లో కూడా ప్రస్తుతం చాలా తక్కువ హిమపాతం పడుతోంది

Jammu Kashmir: తిరిగి తెరుచుకున్న శ్రీనగర్-జమ్మూ హైవే.. విమానాలకు కూడా పచ్చ జెండా

Srinagar-Jammu Highway Reopens

Jammu Kashmir: తీవ్రమైన హిమపాతం కారణంగా కశ్మీర్ లోయకు శుక్రవారం ప్రపంచంతో రవాణా సంబంధాలు కొద్ది రోజుల క్రితం తెగిపోయాయి. అయితే శుక్రవారం సాయంత్రం మంచు తగ్గడంతో జమ్మూ-శ్రీనగర్ హైవే శనివారం ప్రారంభమైంది. అంతే కాకుండా విమాన రాకపోకలను కూడా ప్రారంభించారు. హిమపాతం కారణంగా కొద్ది రోజులుగా ఉదయం సమయంలో రవాణా ఆంక్షలు విధించారు. ఇక శుక్రవారం పూర్తిగా రద్దు చేశారు. రైళ్లు, విమాన రాకపోకల్ని కొన్నింటిని ఆలస్యంగా నడిపించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా మారడంతో అన్నింటి సమయపాలన పునరుద్ధరించారు.

Tamilnadu: అంబేద్కర్ పేరు పలకని వారిని చెప్పుతో కొట్టే హక్కు లేదా? గవర్నర్‭పై డీఎంకే నేత తీవ్ర వ్యాఖ్యలు

‘‘ప్రస్తుతం ఉదయం పూట 3,000 మాటర్ల దూరం వరకు బాగానే కనిపిస్తుందని, దీంతో పెద్ద ఇబ్బుందులేమీ ఉండవు. కశ్మీర్ లోయకు చేరుకోవడానికి జమ్మూ-శ్రీనగర్ మాత్రమే ఏకైక మార్గం. కొద్ది రోజులుగా హిమపాతంతో మూసుకుపోయిన ఈ రోడ్డు, శుక్రవారం సాయంత్రానికి హిమపాతం తగ్గడంతో శనివారం తిరిగి తెరుచుకుంది. శ్రీనగర్‭లో కూడా ప్రస్తుతం చాలా తక్కువ హిమపాతం పడుతోంది’’ అని ఒక అధికారి అన్నారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతోందట. రానున్న రోజుల్లో ఇది కుదుట పడుతుందని ఆయన అన్నారు.

Nitish as Ram – Modi Ravana: నితీశ్ రాముడు, మోదీ రావణుడు.. ఆర్జేడీ ఆఫీసులు ముందు వెలసిన ఫ్లెక్సీ