J&K : జమ్ముకశ్మీర్ లో మరో ఉగ్రదాడి..భద్రతా దళాలు లక్ష్యంగా కాల్పులు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు. శ్రీనగర్ లోని బెమినా ప్రాంతంలోని స్కిమ్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్

Kashmir
J&K జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు. శ్రీనగర్ లోని బెమినా ప్రాంతంలోని స్కిమ్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వద్ద ఇవాళ మధ్యాహ్నాం భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తిరిగి కాల్పులు జరుపగా ఉగ్రవాదులు పారిపోయారు. స్థానిక పౌరులను కవర్ చేసుకుని ఉగ్రవాదులు తప్పించున్నారని శ్రీనగర్ పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు.
ALSO READ ‘sorry mosam cheyaledu’ : ‘సారీ మోసం చేయలేదు’ కమాన్ గుసగుస సోషల్ మీడియాలో చర్చ