SSC Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ పాస్ అయితే చాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 25వేల 271 GD కానిస్టేబుల్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

SSC Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ పాస్ అయితే చాలు

Ssc Recruitment 2021

SSC Recruitment 2021 : 25వేల 271 GD కానిస్టేబుల్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. 18 నుంచి 23 ఏళ్ల వయసున్న టెన్త్ పాస్ అయిన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ ఫీజు చెల్లించవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మెన్లకు ఫీజు లేదు. మిగతావారు రూ.100 చెల్లించాలి. పూర్తి వివరాలకు ssc.nic.in చూడండి…

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి ఇంకా డేట్స్ ఖరారు చేయలేదు.