Tamilnadu: విద్యార్థులు యూనిఫాంలో ఉంటే బస్ పాస్ అడగొద్దంటూ ఆదేశించిన స్టాలిన్ ప్రభుత్వం

యూనిఫాం, పాఠశాల గుర్తింపుకార్డుతో వచ్చే విద్యార్థులను ఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిచేందుకు అనుతించాలని స్పష్టం చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే కండక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) డిపో మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేసింది.

Tamilnadu: విద్యార్థులు యూనిఫాంలో ఉంటే బస్ పాస్ అడగొద్దంటూ ఆదేశించిన స్టాలిన్ ప్రభుత్వం

TNRTC: తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు యూనిఫాం, పాఠశాల గుర్తింపుకార్డుతో వస్తే వారిని ఉచిత ప్రయాణానికి అనుమతించాలని తమిళనాడు రవాణా శాఖ ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) డిపో మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేసింది. వాస్తవానికి రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఉచితంగా ప్రయాణించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా వారికి ఉచితంగా పాసులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

దానికి సంబంధించి విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నామని, అనంతరం పాస్‌లు ముద్రించి, ల్యామినేషన్‌ చేసి అందించడంలో కొంత సమయం పట్టే అవకాశముందని పేర్కొంది. అయితే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 7వ తేది నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున కొత్త బస్‌పాసులు అందజేసే వరకు యూనిఫాం, పాఠశాల గుర్తింపుకార్డుతో వచ్చే విద్యార్థులను ఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిచేందుకు అనుతించాలని స్పష్టం చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే కండక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.