Death Penalty Cases : 40 మరణశిక్ష కేసులపై సుప్రీం విచారణ ప్రారంభం

40 మరణశిక్ష కేసులపై మంగళవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.

Death Penalty Cases : 40 మరణశిక్ష కేసులపై సుప్రీం విచారణ ప్రారంభం

Sc2

Death Penalty Cases 40 మరణశిక్ష కేసులపై మంగళవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ ఈ కేసులను విచారిస్తోంది. దీనికి సంబంధించి గత బుధవారం (సెప్టెంబర్ 1)కోర్టు ఒక సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు విచారించనున్న ఈ కేసుల్లో…లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది మొహమ్మద్‌ ఆరిఫ్ కి సంబంధించిన కేసు కూడా ఉంది.

2000లో ఢిల్లీలోని ఎర్రకోటపై దాడి కేసులో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా ముగ్గురు మరణించిన కేసులో మొహమ్మద్‌ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దోషిగా తేలాడు.

ఇక,సుప్రీం కోర్టు విచారించనున్న కేసుల్లో…నలుగురు దోషుల రివ్యూ పిటిషన్లు కూడా ఉన్నాయి. మరణశిక్షను సమర్థిస్తూ వీరి అప్పీళ్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. మరి కొన్ని కేసులు.. సంబంధిత హైకోర్టులు మరణశిక్షను విధించిన తర్వాత నిందితులు దాఖలు చేసిన అప్పీళ్లు వంటివి ఉన్నాయి.

సెప్టెంబర్ 1 నుండి ఫిజికల్ మోడ్‌లో.. కేసుల తుది విచారణకు సుప్రీంకోర్టు గతంలో కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) జారీ చేసింది. కోవిడ్ -19 నిబంధనలను కఠినంగా పాటిస్తూ…మంగళవారం నుండి గురువారం వరకు హైబ్రిడ్ ఎంపికను ఉపయోగించనున్నట్లు కోర్టు తెలిపింది. ఆగష్టు 28 న సెక్రటరీ జనరల్ జారీ చేసిన SOP ప్రకారం.. సోమ మరియు శుక్ర వారాల్లో కోర్టులు వర్చువల్ మోడ్ ద్వారా వివిధ కేసులను వింటాయని స్పష్టం చేసింది.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుండి వీడియో-కాన్ఫరెన్స్ ద్వారా కేసులను సుప్రీం కోర్టు విచారిస్తోన్న విషయం తెలిసిందే. అయితే అనేక బార్ సంస్థలు మరియు న్యాయవాదులు భౌతిక విచారణలను వెంటనే తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.