Schools open : స్కూళ్లు ఓపెన్ చేసే నిర్ణయం రాష్ట్రాలదే : కేంద్ర ప్రభుత్వం

Schools open : స్కూళ్లు ఓపెన్ చేసే నిర్ణయం రాష్ట్రాలదే : కేంద్ర ప్రభుత్వం

States Can Decide Whether To Open Schools Or Not

States can decide whether to open schools or not : కరోనా వచ్చాక స్కూల్లు మూతపడ్డాయి. కరోనా వేవ్ ల మాదిరి కొనసాగుతుండటంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నా చదువులు అంతంత మాత్రమే అని చెప్పాలి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు స్కూళ్లు తెరవాలని నిర్ణయించుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘స్కూళ్లు తెరవాలా? వద్దా?అనేది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.కరోనా మొదటి వేవ్ లో మూతపడ్డ స్కూళ్లు సెకండ్ వేవ్ లో కూడా తెరుచుకోలేదు.ఈక్రమంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఓపక్క నిపుణులు థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు చేస్తున్నారు. కానీ దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలియనందున ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెరువాలా వద్దా అన్నది రాష్ట్రాలే డిసైడ్‌ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

ఒకవేళ కరోనా కేసులు పెరిగినా పిల్లలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేసిన క్రమంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే అక్కడ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కానీ స్కూళ్లు తెరిస్తే అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తే పిల్లలు కరోనా వ్యాప్తి కారకులుగా మారవచ్చని ఆందోళన కూడా నెలకొంది.ఉపాధ్యాయుల ప్రయార్టీ గ్రూప్‌ కిందకు చేర్చి టీకా ప్రక్రియను వేగవంతం చేయడం రాష్ట్రాలపైనే ఆధారపడి ఉన్నదని కేంద్రం తెలిపింది. దేశ జనాభాలో ఎక్కువ భాగం కరోనా టీకాలు పొందనందున స్కూళ్లు తెరువడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు పేర్కొంది.

దేశంలోని 94.5 కోట్ల మంది పెద్దల్లో ఇప్పటి వరకు కేవలం పది శాతం మంది మాత్రమే కరోనా టీకా పొందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు స్కూళ్ల టీచర్ల టీకా శాతం, పరిస్థితిపై సీబీఎస్‌ఈ, యూజీపీతోపాటు దేశంలోని ఇతర విద్యా సంస్థలు, విద్యా బోర్డుల నుంచి నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కోరింది.

కాగా కరోనా కేసుల నమోదు చూస్తుంటే రోజుకో రకంగా ఉంటోంది. ఓరోజు తగ్గుతుంటే మరోరోజు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ లో లక్షలాదిమంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయినా ఉదృతి మాత్రం తగ్గిందనే చెప్పాలి. దీనికి కారణం వ్యాక్సినేషనే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో స్కూళ్లు తెరిస్తే థర్డ్ వేర్ ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.