అంబేద్కర్ విగ్రహం ధ్వంసం : దళిత సంఘాల ఆందోళన 

  • Published By: veegamteam ,Published On : September 10, 2019 / 08:02 AM IST
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం : దళిత సంఘాల ఆందోళన 

భారత రాజ్యంగకర్త భీమ్ రావు రాంజీ అంబేద్కర్‌కు ఉత్తరప్రదేశ్లో అవమానం జరిగింది. సహారాన్ పూర్‌ ఘున్నా గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహం తల, కుడిచేతిని విరిచేశారు.  దీంతో దళితులు ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ..బెహత్ సహారన్పూర్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా దళిత సంఘా సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ధర్నా చేస్తూ..రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు. 

విగ్రహ ధ్వంసం చేసినవారిని పోలీసులు గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై దళితుల ధర్నాతో అవాంఛనీయ ఘటనలు జరుకుండా పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.