Statue of Godse: గాంధీ జయంతికి గాడ్సే విగ్రహాల ప్రారంభోత్సవం

మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు అఖిల భారత హిందూ మహాసభ వచ్చే అక్టోబర్ నెలలో 2వ తేదీన గాంధీ జయంతి రోజునే మీరట్‌, గ్వాలియర్‌లో నాథూరాం గాడ్సే విగ్రహాలను నెలకొల్పనున్నారు.

10TV Telugu News

Statue of Godse-Apte on Gandhi Jayanti: జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు అఖిల భారత హిందూ మహాసభ వచ్చే అక్టోబర్ నెలలో 2వ తేదీన గాంధీ జయంతి రోజునే మీరట్‌, గ్వాలియర్‌లో నాథూరాం గాడ్సే విగ్రహాలను నెలకొల్పేందుకు సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా నాథూరాం గాడ్సే, నారాయణ్‌ ఆప్టే విగ్రహాలను ప్రతిష్టించేందుకు ఆలిండియా హిందూ మహాసభ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు పండిత్‌ అశోక్‌ శర్మ వెల్లడించారు. ఈమేరకు ఓ ప్రకటన చేశారు అశోక్ శర్మ.

ఎంతోకాలంగా గాడ్సే విగ్రహాలను నిర్మిస్తామని ప్రకటిస్తూ వస్తోన్న హిందూ మహాసభ.. ఎట్టకేలకు ఈ ఏడాది కచ్చితంగా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ ఈ ప్రకటన చేయగానే, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాంధీజీని చంపిన గాడ్సేకి విగ్రహం కట్టించి, హీరోలా చూపించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్. జాతిపితను అవమానించేందుకు జరిగిన కుట్రగా దీన్ని కాంగ్రెస్ అభివర్ణించింది.

మరోవైపు గాడ్సే, ఆప్టే విగ్రహాల ఏర్పాటుపై పోలీసులు నిఘా పెట్టారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు హిందూ మహాసభ కార్యాలయంపై పోలీసులు సోదాలు జరగగా.. 2022 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మహాసభ ప్రకటన పెద్ద వివాదాలకు కారణం అవుతోంది.

రాబోయే రోజుల్లో దేశంలోని 11 నగరాల్లో గాడ్సే, ఆప్టే విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని అశోక్ శర్మ వెల్లడించారు. ఆరేళ్ల క్రితమే మీరట్‌లోని శారదారోడ్డులో ఉన్న హిందూ మహాసభ కార్యాలయంలో గాడ్సే విగ్రహాన్ని ప్రతిష్ఠించామని, మరో తొమ్మిది నగరాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. అయితే, మరోవైపు గాడ్సే విగ్రహాలు ఏర్పాటు చేసేవారిపై రాజద్రోహం కేసులు పెట్టాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది.

10TV Telugu News