Stepson Sews Lips : తండ్రి పెదాలను తాడుతో కుట్టి, రైల్వే ట్రాక్‌పై పడేసి.. కొడుకు హత్యాయత్నం

జార్ఖండ్ లో అమానుష ఘటన జరిగింది. కన్న కొడుకే తండ్రిని అతి కిరాతకంగా హత్య చేయాలని చూశాడు.

Stepson Sews Lips : తండ్రి పెదాలను తాడుతో కుట్టి, రైల్వే ట్రాక్‌పై పడేసి.. కొడుకు హత్యాయత్నం

Stepson Sews Lips

Stepson Sews Lips : జార్ఖండ్ లో అమానుష ఘటన జరిగింది. కన్న కొడుకే తండ్రిని అతి కిరాతకంగా హత్య చేయాలని చూశాడు. ఆయన వయసు 65ఏళ్లు. వృద్ధుడు అని కూడా కనికరం చూపలేదు. ఆ కొడుకు శాడిస్ట్ లా వ్యవహరించాడు. వృద్ధుడి పెదాలను తాడుతో కుట్టి.. కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత స్నేహితుల సాయంతో తండ్రిని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పై పడేశాడు. అయితే స్థానికలు గమనించడంతో వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వృద్ధుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పలాము జిల్లా ఉంటరి రోడ్ బ్లాక్ లోని బీతీహరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 65ఏళ్ల భోలా రామ్ టాయ్ లెట్ కోసం అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లాడు. అదే సమయంలో అతడి రెండో భార్య కొడుకు, అతడి ఇద్దరు స్నేహితులు అక్కడికి వచ్చారు. తన స్నేహితుల సాయంతో కొడుకు.. తండ్రి పెదాలు కుట్టాడు. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి దాడి చేశాడు. ఆ తర్వాత తండ్రిని తీసుకెళ్లి పట్టాలపై పడుకోబెట్టాడు.

తన కొడుకే తనపై దాడి చేసి రైల్వే ట్రాక్ పై పడేశాడని భోలారామ్ కన్నీటిపర్యంతం అయ్యాడు. తెల్లవారుజామున సమయంలో రైల్వే ట్రాక్ పై పడి ఉన్న భోలా రామ్ ను గ్రామస్తులు గమనించారు. భోలారామ్ ని ఆ పరిస్థితుల్లో చూసి వారు షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు పెదవికి, కాళ్లకు చేతులకు ఉన్న తాళ్లు విప్పి వృద్ధుడిని కాపాడారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దారుణం వెనుక తన రెండో భార్య ప్రమేయం కూడా ఉందని బాధితుడు భోలారామ్ ఆరోపించాడు. మొదటి భార్య చనిపోవడంతో భోలారామ్ 2010లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండో భార్యతో గొడవలు జరిగాయి. ఆరు నెలల క్రితం పంచాయతీ కూడా పెట్టారు. ఈ క్రమంలో భోలారామ్ పై ప్రతీకారం పెంచుకున్న రెండో భార్య కొడుకు… తండ్రిని హత్య చేయాలని చూసినట్టు పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.