Stock Market : ఈరోజూ భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. 8రోజుల్లో రూ.17ల‌క్ష‌ల కోట్లు ఆవిరి

స్టాక్ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం చాలా కాష్టం. ఒక్కోరోజు భారీ లాభాలు వస్తాయి, మరో రోజు భారీ నష్టాలు చూడాల్సి ఉంటుంది. అదృష్టం బాగుంటే ఓవర్ నైట్ లో సంపన్నుడు కావొచ్చు..

Stock Market : ఈరోజూ భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. 8రోజుల్లో రూ.17ల‌క్ష‌ల కోట్లు ఆవిరి

Stock Market

Stock Market : స్టాక్ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం చాలా కాష్టం. ఒక్కోరోజు భారీ లాభాలు వస్తాయి, మరో రోజు భారీ నష్టాలు చూడాల్సి ఉంటుంది. అదృష్టం బాగుంటే ఓవర్ నైట్ లో సంపన్నుడు కావొచ్చు, లేదంటే బికారీ కూడా అవ్వొచ్చు. అందుకే స్టాక్ మార్కెట్ చాలా రిస్క్ తో కూడుకున్నదని నిపుణులు చెబుతారు.

కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం సానుకూలంగానే ప్రారంభమైన మార్కెట్లు వెంటనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకున్నప్పటికీ ఎంతో సేపు నిలవలేకపోయాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్(బీఎస్ఈ ఇండెక్స్) 677 పాయింట్లు నష్టపోయి 59,306కి పడిపోయింది. నిఫ్టీ(ఎన్ఎస్ఈ ఇండెక్స్) 185 పాయింట్లు కోల్పోయి 17,671కి దిగజారింది.

Puneeth Rajkumar : అదేపనిగా జిమ్ చేస్తున్నారా? పునీత్ గుండెపోటుకు కారణం ఏంటి?

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.61%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.12%), మారుతి సుజుకి (1.49%), టాటా స్టీల్ (1.34%), టైటాన్ కంపెనీ (0.66%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-3.53%), ఎన్టీపీసీ (-3.05%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.62%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.53%), ఎల్ అండ్ టీ (-2.51%).

మొత్తంగా 8 రోజుల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు సుమారు రూ.17 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌ను కోల్పోయాయి. బీఎస్ఈ లార్జ్ క్యాప్ 0.88 % కోల్పోగా, మిడ్ క్యాప్ లాభాల‌తో ముగిసింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ న‌ష్టంతోనే ముగిసింది.

Puneeth Rajkumar : వయసులో చిన్న.. వ్యక్తిత్వంలో మిన్న.. తండ్రిలానే కళ్లు దానం చేసిన పునీత్ రాజ్ కుమార్..

మార్కెట్ల‌లో ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో కేవ‌లం 9 స్క్రిప్ట్‌లు లాభాలు పొందితే, 21 స్టాక్స్‌లో డౌన్ ట్రెండ్ కొన‌సాగింది. మార్కెట్ లీడ‌ర్ రిల‌య‌న్స్ షేర్లు 2.38 శాతం న‌ష్టంతో రూ.2538 దగ్గర స్థిర ప‌డింది. రిల‌య‌న్స్ ఎం-క్యాప్ రూ.16.09 ల‌క్ష‌ల కోట్ల దగ్గర నిలిచింది. అలాగే కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, లార్సెన్ అండ్ ట‌ర్బో, యాక్సిస్ బ్యాంక్‌, ఇన్ఫోసిస్ రెండు శాతం న‌ష్ట‌పోయాయి. ఇక కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ ఐఆర్సీటీసీ షేర్ 7.85 శాతం ప‌త‌నంతో రూ.845.65 దగ్గర స్థిర ప‌డింది.