Arvind Kejriwal: గుజరాత్ ర్యాలీలో సీఎం కేజ్రీవాల్ వైపునకు రాయి విసిరిన వ్యక్తి.. వీడియో వైరల్

గుజరాత్ లోని సూరత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైపునకు గుర్తుతెలియని వ్యక్తి రాయిని విసిరేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఎం కేజ్రీవాల్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. బీజేపీ కార్యకర్తలే కేజ్రీవాల్ పై రాయి విసిరేశారని ఆప్ నేతలు మండిపడుతున్నారు.

Arvind Kejriwal: గుజరాత్ ర్యాలీలో సీఎం కేజ్రీవాల్ వైపునకు రాయి విసిరిన వ్యక్తి.. వీడియో వైరల్

Arvind Kejriwal

Arvind Kejriwal: గుజరాత్ లోని సూరత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైపునకు గుర్తుతెలియని వ్యక్తి రాయిని విసిరేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఎం కేజ్రీవాల్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. బీజేపీ కార్యకర్తలే కేజ్రీవాల్ పై రాయి విసిరేశారని ఆప్ నేతలు మండిపడుతున్నారు.

తన వైపుగా రాయి వచ్చి పడ్డాక దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. 27 ఏళ్లుగా గుజరాత్ అభివృద్ధి కోసం బీజేపీ ఏమీ చేయలేదని విమర్శించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోయిందని, బీజేపీ నేతలు అభివృద్ధి కోసం పాటు పడకుండా కేవలం దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తనపై ఇప్పుడు రాయి విసిరేశారని చెప్పారు. 27 ఏళ్లుగా బీజేపీ అభివృద్ధి పనులు చేసి ఉంటే ఇప్పుడు తనపై రాయి విసిరే అవసరం బీజేపీకి ఉండకపోయేదని అన్నారు.

Kim’s Daughter: మరోసారి తన కూతురితో కలిసి సైనికుల వద్దకు కిమ్.. ఏం సందేశం ఇస్తున్నారు?

తాను పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తానని చెబుతున్నానని, తాను ఏ తప్పూ చేయలేదని అయినా తనపై దాడి చేస్తున్నారని చెప్పారు. కేజ్రీవాల్ కు ప్రజలు పూలతో స్వాగతం పలుకుతుంటే, బీజేపీ గూండాలు రాళ్లు విసురుతున్నారని ఆప్ అభ్యర్థి అల్పేశ్ ఖత్రియా విమర్శించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..