Stop Flights: “విమానాలను ఆపేయండి”.. ప్రధానమంత్రికి సీఎం కేజ్రీవాల్ లేఖ

కొత్త రకం కరోనావైరస్ బారిన పడి ప్రపంచంలోని కొన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

Stop Flights: “విమానాలను ఆపేయండి”.. ప్రధానమంత్రికి సీఎం కేజ్రీవాల్ లేఖ

Modi Cm

Stop Flights: కొత్త రకం కరోనావైరస్ బారిన పడి ప్రపంచంలోని కొన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశాల్లో పరిస్థితులు మనం ఫేస్ చెయ్యకుండా ఉండాలంటే, వెంటనే భారతదేశానికి వచ్చే విమానాలను ఆపాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.

ఈమేరకు ఓ లేఖను రాశారు కేజ్రీవాల్. “మన దేశం గత ఒకటిన్నర సంవత్సరంగా కరోనాపై కఠినమైన పోరాటం చేసింది. చాలా కష్టపడి, లక్షలాది మంది కోవిడ్ యోధుల నిస్వార్థ సేవ కారణంగా, మన దేశం కరోనావైరస్ నుంచి కోలుకుంది.. ఇటువంటి పరిస్థితిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ దేశంలో ప్ర‌వేశించ‌కుండానే మనం దానిని అడ్డుకోవల్సిన అవసరం ఉంది.

Karnataka : రాష్ట్రాన్నే కుదిపేస్తున్న ఈవెంట్..కాలేజీలో 306 కరోనా కేసులు

ఒమిక్రాన్ ఎక్కువ‌గా ఉన్న దేశాల నుంచి విమానాల రాక‌పోక‌ల‌ను నిషేధించాల్సిన అవసరం ఉందని లేఖ‌లో కోరారు కేజ్రీవాల్. ఈ విష‌యంలో ఏ మాత్రం ఆల‌స్యం చేసినా ప‌రిస్థితి చేయిదాటిపోయే ప్ర‌మాద‌ం ఉంది. ఒమిక్రాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల నుంచి విమానాలను తక్షణమే నిలిపివేయాలని, విషయంలో కొంచెం ఆలస్యమైనా దేశానికే హానికరం” అని లేఖలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్.

India Omicron : బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇద్దరు దక్షిణాఫ్రికా వాసులకు కరోనా

కొవిడ్‌ ప్రభావం నుంచి బయటపడుతున్న సమయంలో కొత్త వేరియంట్‌ మూడో వేవ్‌కి కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికా సహా ఇజ్రాయెల్‌, బోట్స్‌వానా, హాంకాంగ్‌లలో ఈ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.