ఫ్రీ.ఫ్రీ..అంటూ ప్రజల్ని బద్ధకస్తుల్ని చేస్తున్నారు : రాజకీయ పార్టీల హామీలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఫ్రీ.ఫ్రీ..అంటూ ప్రజల్ని బద్ధకస్తుల్ని చేస్తున్నారు : రాజకీయ పార్టీల హామీలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Stop Freebies, Create Infra..madras Hc

Stop freebies, create infra..Madras HC : తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు ప్రజల్ని అవి ఫ్రీగా ఇస్తాం. ఇవి ఫ్రీగా ఇస్తాం అంటూ ప్రజల్ని బద్ధకస్తుల్ని చేస్తున్నారంటూ మద్రాస్ హైకోర్టు రాజకీయ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితంగా ఇవ్వటం మానేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించండీ అంటూ చురకలతో కూడిన సూచనలు చేసింది.

కాగా తమిళనాడు ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటంకోసం పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. పార్టీ ఏదైనా హామీలు మాత్రం సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రజలను మభ్యపెడుతూ ఓటు బ్యాంకుల కోసం చేసే ఉచిత హామీల వెల్లువ ఎన్నికల్లో వరదలా పారుతుంటాయి. ఇటువంటి హామీలు తమిళనాడులో ఓ మోతాదు ఎక్కువే ఉంటాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల్లో రాజకీయ పార్టీల నేతలు ఇచ్చే ఉచిత హామీలపై మద్రాసు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఇవి ఉచితం ఇవి ఉచితాలు అంటూ ప్రజల్ని బద్దకస్తుల్ని చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించింది. దేంట్లో ఉన్నా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చే హామీల విషయంలో అన్ని పార్టీలు ఇతర పార్టీల కంటే మెరుగ్గా ఉంటాయని..హామీలు ఇవ్వటంలో ఒక పార్టీని మించి మరో పార్టీ పోటీలు పడుతుంటాయని..ఇటువంటి ఉచిత హామీలు ప్రజలు కష్టపడే మనస్తత్వంపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించింది.

ఇటువంటి హామీలకు ఆశపడి ప్రజలు ఓటు విలువను మరిచిపోయేలా చేయటానికి అవకాశం ఉంటుందనీ..ప్రభుత్వం అందించే ఉచిత సేవలతో బతికేయొచ్చనే అపోహలు ప్రజలు కలుగుతాయని తెలిపింది. ఇటువంటి హామీల కోసం ఖర్చుపెట్టే డబ్బుతో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన చేయవచ్చనీ..అలాగే ఉద్యోగాలు సృష్టించటం..అభివృద్ధి పనులపై ఆయా పార్టీలు దృష్టి పెట్టాలని హైక్టోర్టు చురకలతో కూడిన సూచనలు చేసింది.

కాగా..తమిళనాడు ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీలో ఉన్న శరవణన్ ఇస్తున్న హామీలు వింటుంటే దిమ్మ తిరిగిపోతోంది. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల్ని చంద్రమండలం పైకి తీసుకెళతానని హామీల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ‘నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తాననీ..ఇళ్లలో ఆడవాళ్లకు పనికి సాయంగా ఇంటింటికీ ఒక రోబో పంపిణీ చేస్తాననీ… ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ చేస్తా. ఎండ వేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడేందుకు 300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచు కొండతోపాటు ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమంగా సముద్రాన్ని నిర్మిస్తా. నియోజకవర్గ ప్రజలందరికీ ఉచితంగా ఐఫోన్‌‌లు అందిస్తా’నంటూ చేస్తున్న హామీల వెల్లువ మామూలుగా లేదు. అలాగే పలు పార్టీ నేతలు ఇచ్చే హామీలకు హద్దూ అదుపు ఉండటం లేదు. ఈ ఉచిత హామీలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయటం గమనించాల్సిన విషయం..