Singapore Flights: సింగపూర్ విమానాలను ఆపేయండి.. కరోనా మూడో వేవ్ నుంచి కాపాడమంటూ కేంద్రానికి కేజ్రీవాల్ విన్నపం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ లో మొదలైన కొత్త కొవిడ్ వేరియంట్ గురించి చెప్పారు. అక్కడి నుంచి వచ్చే విమానాలను ఆపేయాలని కేంద్రాన్ని..

Singapore Flights: సింగపూర్ విమానాలను ఆపేయండి.. కరోనా మూడో వేవ్ నుంచి కాపాడమంటూ కేంద్రానికి కేజ్రీవాల్ విన్నపం

Kejiriwal

Singapore Flights: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ లో మొదలైన కొత్త కొవిడ్ వేరియంట్ గురించి చెప్పారు. అక్కడి నుంచి వచ్చే విమానాలను ఆపేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ వేరియంట్ ప్రభావానికి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నట్లు ప్రూవ్ అయింది. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకుని సింగపూర్ నుంచి వచ్చే విమానాలను ఆపేయాలని కోరారు.

‘సింగపూర్ లో కనిపించిన కరోనా కొత్త రకం చాలా ప్రమాదకరం. ప్రత్యేకించి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దాని కారణంగా ఇండియాలో మూడో వేవ్ వచ్చే అవకాశాలూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే.. వెంటనే సింగపూర్ నుంచి వచ్చే ఎయిర్ సర్వీసులను క్యాన్సిల్ చేయాలి. వ్యాక్సిన్ విధానంలో పిల్లలకు కూడా ప్రాధాన్యత కల్పించాలని హిందీలో ట్వీట్ చేశారు.

ఢిల్లీ సీఎం చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెకండ్ వేవ్ యువతపై ప్రభావం చూపిస్తే థర్డ్ వేవ్ పిల్లలను కూడా వదలడం లేదని కామెంట్లు చేస్తున్నారు.

నిపుణులు సైతం థర్డ్ వేవ్ గురించి ప్రస్తావిస్తున్నారు. అది చిన్న పిల్లలకు వస్తుందని.. ఫస్ట్ వేవ్ పెద్ద వాళ్లపైనే ఎక్కువ ప్రభావం చూపించగా, రెండో వేవ్ యువతను బాగా కుంగదీసిందని చెప్పతున్నారు. వారిలో ఉన్న ఇమ్యూనిటీ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉందని పేర్కొన్నారు.