పాక్ కు గడ్కరీ వార్నింగ్…తాగడానికి నీళ్లు ఇవ్వం

  • Published By: venkaiahnaidu ,Published On : May 9, 2019 / 05:25 AM IST
పాక్ కు గడ్కరీ వార్నింగ్…తాగడానికి నీళ్లు ఇవ్వం

పాకిస్తాన్ తమ దేశంలోని ఉగ్రవాదులకు సహామందించడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇమ్రాన్ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.పాక్ కంటిన్యూస్ గా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందని,పాక్ కనుక ఉగ్రవాదులను సపోర్ట్ చెయ్యడం ఆపకపోతే పాక్ వైపు ప్రవహించే నదీ జలాలను అడ్డుకోవడానికి భారత్ ఏ మాత్రం వెనకాడబోదని గడ్కరీ తేల్చి చెప్పారు.పంజాబ్ లోని అమృత్ సర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హర్దీప్ పూరికి మద్దతుగా బుధవారం(మే-8,2019) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ మీదుగా పాకిస్తాన్ లోకి వెళ్లే నదీ జలాలను ఆపి హర్యానా,పంజాబ్,రాజస్థాన్ లకు మళ్లించేందుకు కేంద్రప్రభుత్వం ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ కు మూడు నదుల నుంచి నీరు వెళ్తోందని,తాము అవి ఆపాలి అని అనుకోలేదని కానీ ప్రశాంతమైన సంబంధాలు,స్నేహాభావం మద్య కుదిరిన ఒప్పందం ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని,అందువల్ల తాము ఆ ఒప్పందాన్ని ఫాలో కాబోమని గడ్కరీ అన్నారు.