సాయం అడిగితే ఇండియాకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా: రఘురామ్ రాజన్

సాయం అడిగితే ఇండియాకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా: రఘురామ్ రాజన్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇండియాకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కొవిడ్ 19 కారణంగా ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన భారత్ కోలుకునేందుకు తన వంతుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. బ్యాంకింగ్, ఏవియేషన్ లాంటి పలు రంగాలు ఇప్పటికే క్లిష్ట పరిస్థితులకు చేరుకున్నాయి. అత్యవసర సేవలు మినహాయించి ఇతరత్రాలన్నీ మూత పడ్డాయి.

‘దీనికి నా సమాధానం అవుననే చెప్తా’ అంటున్నారు రఘురామ్ రాజన్. ఆర్బీఐ గవర్నర్ పదవి తర్వాత అమెరికాలోని చికాగో యూనివర్సిటీలో టీచింగ్ చేస్తున్నారాయన. ‘వైరస్ వ్యాప్తి పెరిగి ఇటలీ, యూఎస్‌లలో విజృంభించిన స్థాయిలా మారకముందే మనం జాగ్రత్తపడాలి. ఆ దేశాల్లోని పబ్లిక్ హెల్త్ పై చాలా ప్రభావం చూపించింది. చాలా హాస్పిటల్స్ లో చాలా మరణాలు చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఆర్థిక రంగాన్ని వృద్ధి చేయడం కష్టంతో కూడుకున్న పనే’ అని అన్నారు. 

ప్రపంచం దారుణమైన పరిస్థితుల్లోకి కూరుకుపోయింది. కష్టపడి ట్రై చేస్తే వచ్చే ఏడాదికల్లా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మహమ్మారి గురించి తీసుకునే చర్యలపైనే ఆధారపడి ఉంటుంది’ అని రాజన్ వివరించారు. బ్యాంకులన్నింటినీ మూడు నెలల ఈఎమ్ఐలు కట్టించుకోవద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏవియేషన్ సంబంధిత రంగాలన్నీ మూతపడ్డాయి. 

లాక్ డౌన్ పై ప్రధాని మోడీ కీలక నిర్ణయాన్ని ఆదివారం ప్రకటిస్తారు. విదేశీ మారక ద్రవ్యం విలువలపై ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని మోడీతో కలిసి పని చేస్తారా.. డీ మోనిటైజేషన్ ద్వారా భారత్ ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోయిందని విమర్శలు చేసి సాయం అడిగితే చేస్తానంటోన్న రాజన్ ను కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా.. చూడాలి. మరో వైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్..(ఐఎమ్ఎఫ్) రఘురామ్ రాజన్‌ను అడ్వైజరీ ప్యానెల్ లో కీ మెంబర్ గా నియమించుకుంది. 

See Also | కట్టుకున్న ప్రేమ ఇదే కదా: సైకిల్‌పై 120కిలోమీటర్లు భార్యతో..