Man eat sand: ఇసుక తిని బతికేస్తున్నాడు.. 40ఏళ్లుగా అతని ఆహారం ఇసుకే

మనం ఇంట్లో వండిన అన్నం కొంచెం పలుకుగా ఉంటేనే తినడానికి ఇబ్బందిపడతాం. ఒకవేళ తిన్నా అరుగుదల సరిగా ఉండక కడుపునొప్పి రావటం ఖాయం. అలాంటిది 40ఏళ్లుగా ఓ వ్యక్తి ఇసుకనే ఆహారంగా మార్చేసుకున్నాడు. వినడానికి కొంచెం విచిత్రగా ఉన్నప్పటికీ..

Man eat sand: ఇసుక తిని బతికేస్తున్నాడు.. 40ఏళ్లుగా అతని ఆహారం ఇసుకే

Sand Man

Man eat sand: మనం ఇంట్లో వండిన అన్నం కొంచెం పలుకుగా ఉంటేనే తినడానికి ఇబ్బందిపడతాం. ఒకవేళ తిన్నా అరుగుదల సరిగా ఉండక కడుపునొప్పి రావటం ఖాయం. అలాంటిది 40ఏళ్లుగా ఓ వ్యక్తి ఇసుకనే ఆహారంగా మార్చేసుకున్నాడు. వినడానికి కొంచెం విచిత్రగా ఉన్నప్పటికీ.. నమ్మి తీరాల్సిందే. హరిలాల్‌ది ఉత్తరప్రదేశ్ లోని గంజాం జిల్లా కీర్తిపూర్ గ్రామం. ఆయన భవన నిర్మాణకార్మికుడుగా పనిచేస్తున్నాడు. అయితే ఉపాధి కోసం ప్రస్తుతం వలస వెళ్లాడు. హరిలాల్ కు ఇసుక అంటే చాలా ఇష్టం. మనం అన్నంతిన్నట్లుగా గత నలబైఏళ్లుగా ఇసుకను తినేస్తాడు.

Electric Bike Explosion: అర్ధరాత్రి పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఇంటికి అంటుకున్న మంటలు

యూపీలోని అరంగాపూర్ లో పుట్టిన హరిలాల్ కు ప్రస్తుతం 68ఏళ్లు.. అతడికి చిన్నతనం నుండే ఇసుక తినడం అలవాటు. మనకు ఎవరైనా బిర్యాని పెడితే ఎలా లొట్టలేసుకొని తింటామో.. హరిలాల్ మెత్తటి ఇసుక దొరికితే అలా లొట్టలేసుకొని తినేస్తాడు. అతని గ్రామానికి దగ్గరలోనే నది ఉండటం వల్ల ప్రతీరోజూ ఆ నది దగ్గరికి వెళ్లడం ఇసుక తినడం అతనికి అలవాటుగా మారింది. వర్షాకాలం వస్తుందంటే హరిలాల్ ముందే అలర్ట్ అవుతాడు. నదిలోకి వరదనీరు వచ్చి ఇసుక దొరకదన్న ఉద్దేశంతో రెండుమూడు నెలలకు సరిపడా ఇసుక బస్తాల్లో నింపుకొని తీసుకొచ్చి ఇంట్లో నిల్వ చేస్తాడు.

Cancer drug trial: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్.. వైద్య చరిత్రలో తొలిసారి..

ఒకప్పుడు విపరీతంగా ఇసుకను తినే ఆయన.. ప్రస్తుతం కాస్త తగ్గించాడట. ఇసుక తిన్న తర్వాత కొంచెం అసౌకర్యంగా ఉంటుందని, కానీ ఇప్పటి వరకు నేను ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని హరిలాల్ తెలిపాడు. అయితే మొదట్లో కుటుంబ సభ్యులు, తరువాత గ్రామస్తులు, తోటి కూలీలు ఎన్నిసార్లు ఇసుకను తినడం మానమని ఒత్తిడి తెచ్చినా హరిలాల్ మాత్రం ఇసుకే నా ప్రాణం అన్నట్లుగా ఇప్పటికీ ఇసుకను తింటూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంకు చెందిన మరో వ్యక్తి ఇసుక, కంకర తింటూ బతికేస్తున్నాడు. రాజ్ అనే వ్యక్తి గత 30ఏళ్లుగా ఇసుక, సన్నటి కంకర తింటూ జీవిస్తున్నాడు. దీంతో అతని గ్రామస్తులు ఇసుక మనిషి అని పేరుకూడా పెట్టారు.