Holi Celebrations : హోలీ సంబరాల్లో వింత ఆచారం… ఆడవాళ్లు మగవారిగా… మగవారు…ఆడవాళ్లుగా..

హోలి సంబరాలు అక్కడ వింతగా ఉంటాయి. మగవాళ్లు ఆడవాళ్లుగా మారిపోతారు. కట్టు, బొట్టు, మాట తీరు అచ్చం సంప్రదాయ మహిళలను తలపిస్తుంది. నెత్తిపై నైవేద్యంతో నింపిన కుంభాన్ని పెట్టుకుని ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల అనంతరం మళ్లీ తిరిగి ఇంటికి వస్తారు.

Holi Celebrations : హోలీ సంబరాల్లో వింత ఆచారం… ఆడవాళ్లు మగవారిగా… మగవారు…ఆడవాళ్లుగా..

Holi Celebrations 2021

Holi Celebrations 2021 : హోలీ సంబరాలు అక్కడ వింతగా ఉంటాయి. మగవాళ్లు ఆడవాళ్లుగా మారిపోతారు. కట్టు, బొట్టు, మాట తీరు అచ్చం సంప్రదాయ మహిళలను తలపిస్తుంది. నెత్తిపై నైవేద్యంతో నింపిన కుంభాన్ని పెట్టుకుని ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల అనంతరం మళ్లీ తిరిగి ఇంటికి వస్తారు. దారిలో తమకు తెలిసిన, ఇష్టమున్న వ్యక్తులను దూషిస్తారు. ఆ వ్యక్తులు గతంలో చేసిన బండారం అంతా తిట్ల పురాణంలో వెలుగులోకి తెస్తారు.

ఇష్టమున్న వ్యక్తులను ఆలింగనం చేసుకుంటారు. దూషణలు, ఆలింగనాలను రతి, మన్మథుల ఆశీస్సులుగా భావిస్తారు. దీని వల్ల తమ కుటుంబానికి అంతా మంచి జరుగుతోందని విశ్వసిస్తారు. నిష్టతో తమ ఇలవేల్పు రతి, మన్మథులకు మొక్కుబడి తీర్చుకునే క్రమంలోనే వింత ఆచారం కొనసాగుతోంది. వింత ఆచారం చూసే వాళ్లకు మాత్రం తరువాత పెద్ద గొడవలే జరుగుతాయోమోనన్న ఆందోళన కలిగిస్తోంది. వందేళ్లకు పైగా ఈ వింత ఆచారం ప్రశాంతంగానే ఎలాంటి గొడవలు లేకుండానే కొనసాగుతోంది.

నేటి నుంచే వేడుకలు :
పాల్గుణ మాసం శుద్ద దశమిని పురస్కరించుకుని నిర్వహించే వేడుకలు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు కొనసాగుతాయి. ఆది, సోమ వారాల్లో గ్రామం నడి బొడ్డున ఉన్న ఆలయంలో కొలువు దీరిన రతి,మన్మథుల విగ్రహాలను పలు రంగుల పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 6 గంటలకు కామ దహనం, సాయంత్రం శస్త్ర ధారణ కార్యక్రమాలు జరుగుతాయి.

ఈ సందర్బంగా రెండు దవడల్లో దబ్బణం గుచ్చిన రంధ్రంలో నుంచి 101 అడుగుల పొడువైన తాడును లాగుతారు. ఆది సోమవారాల్లో సాయంత్రం ఎంతో అందంగా తీర్చి దిద్దిన చిన్ప పిల్లలను విమానం పోలిన వాహనంలో కూర్చోబెట్టి మేళ,తాళాల మధ్య ఊరేగింపు నిర్వహిస్తారు.