టాయిలెట్ లో కుక్క, చిరుత..ఎలా వచ్చాయి ? తర్వాత ఏం జరిగింది ?

టాయిలెట్ లో కుక్క, చిరుత..ఎలా వచ్చాయి ? తర్వాత ఏం జరిగింది ?

stray dog locked up in toilet : టాయిలెట్ లో కుక్క, చిరుత ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతర జంతువులను చంపే అలవాటు ఉన్న చిరుత..కుక్కను ఏమీ చేయకపోవడం విశేషం. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా…ఆరు గంటల వరకు అందులో ఉన్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని వాటిని పట్టుకున్నారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పులి, కుక్క స్టోరీని ఫొటోతో సహా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్వీట్ చేశారు. ‘ప్రతీ కుక్కకు ఓ రోజు వస్తుంది. ఓ గదిలో పులితో పాటు గంటల పాటు కుక్క చిక్కుకపోవడాన్ని ఊహించండి. అది ఇంకా జీవించే ఉంది’ అని రాసుకొచ్చారు.

కకింగ నగరానికి సమీపంలో బిలినెలె గ్రామంలో జయలక్ష్మీ అనే మహిళకు ఫామ్ హౌస్ ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పెద్దగా శబ్దం రావడంతో..జయలక్ష్మీ బయటకు వచ్చి చూసింది. బయట చూసిన అనంతరం ఎందుకో అనుమానం వచ్చి టాయిలెట్ లో తొంగి చూసింది. అక్కడ కుక్క, చిరుతను చూసి భయపడిపోయింది. చప్పుడు కాకుండా..ఆ గదికి బయటి నుంచి తాళం వేసింది. అనంతరం అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన అధికారులు లోపల ఉన్న వాటిని బయటకు తీసే ప్రయత్నం చేశారు.

పులి..కుక్క ఎదురెదురుగా ఎలాంటి హడావుడి లేకుండా నిశబ్దంగా కూర్చొవడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. పంజా దూరంలోనే కుక్కా ఉన్నా ఏ మాత్రం కిక్కురుమనకుండా..మూలకు చిరుత నక్కడం విశేషం. తలుపు తెరిచే ముందు..చుట్టూ వల వేశారు. ఓ బోనును కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. బాత్ రూమ్ పైన షీట్ కు హోల్ చేశారు. షీట్ ను తొలగించగానే..చిరుత అమాంతం బయటకు దూకింది. అప్పటికే సిద్ధం చేసిన వలలో చిక్కుకపోయింది. బయటకు వచ్చిన కుక్కను కూడా రక్షించారు.