Leh-Delhi Flight : వీధి కుక్క ఎంత పనిచేసింది.. ఆలస్యంగా లేహ్-ఢిల్లీ గో ఫస్ట్ విమానం టేకాఫ్..!

విమానం బయల్దేరానికి రెడీగా ఉంది. ప్రయాణికులందరూ ఎక్కేశారు. యానౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.. పైలట్ రెడీగా ఉన్నాడు..

Leh-Delhi Flight : వీధి కుక్క ఎంత పనిచేసింది.. ఆలస్యంగా లేహ్-ఢిల్లీ గో ఫస్ట్ విమానం టేకాఫ్..!

Stray Dog On Runway Delays Go First's Leh Delhi Flight (1)

Leh-Delhi Flight : విమానం బయల్దేరానికి రెడీగా ఉంది. ప్రయాణికులందరూ ఎక్కేశారు. యానౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.. పైలట్ రెడీగా ఉన్నాడు.. ఇక టేకాఫ్ చేయడమే ఆలస్యం.. ఇంతలో రన్‌వేపైకి దూసుకొచ్చింది ఓ వీధి కుక్క.. అంతే.. టేకాఫ్ కావాల్సిన విమానం ఆలస్యమైంది. మంగళవారం (జూలై 19)న గో ఎయిర్ ఫస్ట్ విమానం G8-226 (లేహ్ – ఢిల్లీ) ఆలస్యంగా టేకాఫ్ అయింది.

లేహ్-ఢిల్లీ విమానం రన్‌వేపై కుక్క కారణంగా టేకాఫ్‌ చేసేందుకు పైలట్ తిరస్కరించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ వోస్‌లో ఇదే మొదటిది. తెల్లవారుజామున, ముంబై-లేహ్ గో ఫస్ట్ (గతంలో గోఎయిర్) విమానం ఇంజిన్‌లలో లోపం కారణంగా ఢిల్లీకి అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చింది. మరొక ఘటనలో అదే ఎయిర్‌లైన్‌కు చెందిన శ్రీనగర్-ఢిల్లీ విమానం ఇంజిన్‌లలో ఒకదానిలో సాంకేతిక సమస్య తలెత్తింది.

Stray Dog On Runway Delays Go First's Leh Delhi Flight (2)

Stray Dog On Runway Delays Go First’s Leh Delhi Flight

దాంతో వెంటనే ఆ విమానాన్ని తిరిగి బయల్దేరిన విమానాశ్రయానికే తరలించారు. అయితే కుక్క కారణంగా టేకాఫ్ ఆలస్యమైన ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపారు. ప్రస్తుతానికి ఈ రెండు విమానాలు గ్రౌండింగ్ చేశామని, DGCA క్లియర్ చేసినప్పుడే మళ్లీ బయల్దేరుతాయని చెప్పారు.

Read Also :  Labour Died: లీవ్ ఇవ్వలేదని వెళ్లిపోయిన లేబర్లు.. నదిలో మునిగి ఒకరు మృతి