Stray Dogs Indian Soldiers : మంచుకొండల్లో భారత సైనికులకు సహాయంగా వీధి కుక్కలు .. ఆర్మీని అప్రమత్తం చేస్తున్న స్ట్రీట్ ఫ్రెండ్స్

మంచుకొండల్లో భారత సైనికులకు సహాయంగా వీధి కుక్కలు పనిచేస్తున్నాయి. జవాన్లతెో పాటు పనిచేస్తున్నాయి. ఎటునుంచి అలికిడి వినిపించినా పసిగట్టి ఆర్మీని అప్రమత్తం చేస్తున్నాయి స్థానికంగా ఉండే శునకాలు. అందుకే వాటిని సైనికులకు ఫ్రెండ్స్ గా మారాయి.

Stray Dogs Indian Soldiers : మంచుకొండల్లో భారత సైనికులకు సహాయంగా వీధి కుక్కలు .. ఆర్మీని అప్రమత్తం చేస్తున్న స్ట్రీట్ ఫ్రెండ్స్

Stray Dogs Are Indian Soldiers’ Early Warning System

Stray Dogs Indian Soldiers..Early Warning System : మండే ఇసుక ఎడారుల్లోను..రక్తం గడ్డకట్టే మంచులోను పహారా కాస్తూ దేశం కోసం అహర్నిశలు శ్రమించే భారత సైనికుల త్యాగాలను మాటల్లో చెప్పలేం. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా దేశం కోసం పహారా కాస్తున్న సైనికులకు తోడుగా మేమున్నాం అంటున్నాయి శునకాలు. శునకాలు అంటే అవేవో ట్రైనింగ్ డాగ్స్ అనుకోవద్దు. ఓ సాధారణ వీధి కుక్కలు మంచు కొండల్లో భారత సైనికులకు సహాయం చేస్తున్నాయి. ఒళ్లంతా కళ్లు చేసుకుని శతృవుల కన్నదేశంపైగానీ సరిహద్దుల మీదగానీ పడితే విరుచుకుపడటానికి అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు సరిహద్దుల్లో సైనికులు. అటువంటి సైనికులకు మేముసైతం ఉన్నామంటున్నాయి స్థానికంగా ఉండే కుక్కలు. సైనికులు డ్యూటీలు మారినా అవి మాత్రం తమ డ్యూటీ మాత్రం కొనసాగిస్తున్నాయి స్థానికంగా ఉండే కొన్ని కుక్కలు. ఎటునుంచి అలికిడి వినిపించినా మొరుగుతు సైనికులను సిద్ధంచేస్తున్నాయి.

ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir) అంటేనే మంచు వర్షం కురిసే ప్రాంతం. కశ్మీర్ లోని గుల్‌మార్గ్‌(Gulmarg)లో నియంత్రణ రేఖ (LOC) వెంట మంచు కురిసే (Snow Fall) సమయాల్లో ఎత్తైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయడం భారత సైన్యానికి (Indian Army) సవాల్‌లాంటిది. ఆ సమయంలో స్థానికంగా ఉండే వీధి శునకాలు ఎటునుంచి అలికిడి వినిపించినా వెంటనే సైనికులకు హెచ్చరిక వ్యవస్థలుగా పని చేస్తున్నాయి. ఎల్‌వోసీ వెంట పెట్రోలింగ్ చేసే సైన్యంతోపాటు అవి కూడా తిరుగుతుంటాయి. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే వెంటనే స్పందిస్తాయి. సైనికులను హెచ్చరిస్తూ మొరుగుతాయి. అలా సైనికులకు స్నేహితులగా మారిపోయాయి ఆ స్ట్రీట్ డాగ్స్..అందుకే అవి సైనికులకు స్ట్రీట్ ఫ్రెండ్స్ అయ్యాయి.

ఈ వీధి కుక్కలు (స్థానికంగా ఉండే కుక్కలు) గురించి భారత్ సైనికులు మాట్లాడుతూ..స్థానికంగా ఉండేవారికి అవి సర్వసాధారణ కుక్కలే. కానీ మాకు అలా కాదు. మాకు అవి స్నేహితులు కూడా అంటున్నారు. ఎల్‌వోసీ వెంట పెట్రోలింగ్ చేసే సైన్యంతోపాటు అవి కూడా తిరుగుతుంటాయని..ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే అవి వెంటనే స్పందిస్తాయని మాకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ రోజంతా మాతో ఉంటాయి. మాకూడానే తిరుగుతుంటాయి. అలా యూనిట్లతో కలిసి పనిచేస్తుంటాయని అలా ఆ స్థానిక శునకాలు వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా, సైనికులకు దారిచూపుతున్నాయి.

అంతేకాదు అవి కేవలం గస్తీ తిరిగే సైనికులతోనే కాడు కొన్ని సందర్భాల్లో వారితో పాటు సైనిక స్థావరాల వరకు వెళుతుంటాయి. ఎటువంటి వాహనాలు వెళ్లలేని చోటికి కూడా మంచు కొండల్లో తమతో పాటే వెన్నంటి ఉంటాయని..కాలినడకన మాత్రమే చేరుకోగలిగే ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అయినా అవి మా వెంటే ఉంటాయని తెలిపారు. అవి మాకు ఫ్రెండ్స్..మంచు కొండల్లో వాటికి ఆహారం కూడా పెద్దగా లభించదు. దీంతో సైనికులు తమ కోసం తెచ్చుకున్న బిస్కెట్లు, టీ, వాటర్ వంటివి వాటికి పెడుతుంటామని ఓ సైనికుడు తెలిపాడు.

స్థానిక శునకాలు అందించే ఇటువంటి సహాయం గురించి భారత సైన్యం 19 ఇన్ఫాంటరీ డివిజన్‌ కమాండింగ్ ఆఫీసర్‌ మేజర్‌ జనరల్‌ అజయ్‌ చంద్‌ పురియా మాట్లాడుతూ.. ‘‘సైనికులు, శునకాల మధ్య స్నేహం అసాధారణమైందేమీ కాదని..అవి మనిషిని మంచి స్నేహితుడిగా భావిస్తాయని అలా మనుషులతో కూడా కలిసి మెలిసి ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా శీతాకాలం (Winter)లో.. సైనికులకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయాల్లో మంచు ఎక్కువగా పడుతున్న సందర్భాల్లో సైనికులకు అవి మంచి తోడుగా ఉంటున్నాయని తెలిపారు.