Asaduddin Owaisi: ఇండియాలో ముస్లింల కంటే వీధి కుక్కలకే గౌరవం ఎక్కువ

గుజరాత్‭లో రాళ్లు రువ్వారని ముస్లిం యువకుల్ని బహిరంగంగా కట్టేసి కొట్టారు. అసలు పోలీసులు చేసే డ్యూటీయేనా ఇది? ఇదేనా మన వ్యవహార శైలి? లౌకిక దేశంలో ముస్లింలకు కనీస ప్రాధాన్యం లేదు? ముస్లింలు మనుషులు కాదా? ప్రధానమంత్రి గుజరాత్ వ్యక్తి. ఈ ఘటనపై ఆయనే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకుంటే కోర్టులు, జైళ్లు మూసేయండి. పోలీసు ఫోర్సుని కూడా రద్దు చేయండి. బీజేపీ కార్యకర్తలే తీర్పులు చెప్తారు, శిక్షలు వేస్తారు

Asaduddin Owaisi: ఇండియాలో వీధి కుక్కలకైనా గౌరవం ఉంటుందేమో కానీ, ముస్లింలకు ఉండదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కళ్లకు కనిపిస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన గుర్బాపై ముస్లి వ్యక్తులు రాళ్లు విసిరారంటూ వచ్చిన ఆరోపణలపై ఓవైసీ స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.

‘‘భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడి ముస్లింలు బహిరంగ జైలులో ఉన్నట్లు భావిస్తారు. మదర్సాలు కూలిపోతాయి, ముస్లింల ఇళ్లు కూలిపోతాయి. ముస్లింలపై ఆరోపణలు అవసరం లేకుండానే ఇవన్నీ జరిగిపోతాయి. నిజానికి ఈ దేశంలో వీధి కుక్కకు ఉండే గౌరవం కూడా ముస్లింలకు ఉండదు’’ అని ఓవైసీ అన్నారు. గార్బాపై రాళ్లు రువ్వారని 9 మంది ముస్లిం యువకులను పట్టుకున్నట్లు పోలీసులు.. కరెంట్ పోలుకు వారిని కట్టేసి బహిరంగంగా చితకబాదారు. ఈ తతంగం చూస్తున్నవారు ‘గుజరాత్ పోలీస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయడం గమనార్హం.

దీనిపై ఓవైసీ స్పందిస్తూ ‘‘గుజరాత్‭లో రాళ్లు రువ్వారని ముస్లిం యువకుల్ని బహిరంగంగా కట్టేసి కొట్టారు. అసలు పోలీసులు చేసే డ్యూటీయేనా ఇది? ఇదేనా మన వ్యవహార శైలి? లౌకిక దేశంలో ముస్లింలకు కనీస ప్రాధాన్యం లేదు? ముస్లింలు మనుషులు కాదా? ప్రధానమంత్రి గుజరాత్ వ్యక్తి. ఈ ఘటనపై ఆయనే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకుంటే కోర్టులు, జైళ్లు మూసేయండి. పోలీసు ఫోర్సుని కూడా రద్దు చేయండి. బీజేపీ కార్యకర్తలే తీర్పులు చెప్తారు, శిక్షలు వేస్తారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Cong President Poll: అధికారిక అభ్యర్థి, ఓడిపోయే అభ్యర్థి.. శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు