India : స్ట్రోక్స్ తో ఒక్క ఏడాదిలో 6.99 ల‌క్ష‌ల మంది మృతి : అధ్య‌య‌నంలో వెల్లడి

భారత్ లో పలు రకాల నాడీ రుగ్మతల వల్ల చనిపోయిన వారి వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రకరకాల నరాల రుగ్మతల వల్ల దేశంలో స్ట్రోక్‌తో ఒక్క సంవత్సరంలోనే 6,99,000మంది మరణించారని ది లాన్సెట్ గ్లోబ‌ల్ హెల్త్ జ‌న‌ర‌ల్‌లో ప్ర‌చురితమైన పత్రం తెలిపింది. భారతదేశంలో ఒక్క 2019లోనే 6,99,000 మంది స్ట్రోక్‌తో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 2019 ఏడాదిలో సంభ‌వించిన మొత్తం మ‌ర‌ణాల్లో ఈ బ్రెయిన్ స్ట్రోక్ మ‌ర‌ణాల శాతం 7.4 శాతంగా ఉంది.

India : స్ట్రోక్స్ తో ఒక్క ఏడాదిలో 6.99 ల‌క్ష‌ల మంది మృతి : అధ్య‌య‌నంలో వెల్లడి

Stroke Caused 6,99,000 Deaths In India

Stroke caused 6,99,000 deaths in India : భారత్ లో పలు రకాల నాడీ రుగ్మతల వల్ల చనిపోయిన వారి వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రకరకాల నరాల రుగ్మతల వల్ల దేశంలో స్ట్రోక్‌తో ఒక్క సంవత్సరంలోనే 6,99,000మంది మరణించారని ది లాన్సెట్ గ్లోబ‌ల్ హెల్త్ జ‌న‌ర‌ల్‌లో ప్ర‌చురిత‌మైన ఒక అధ్య‌య‌నం పత్రం తెలిపింది.ఆ అధ్య‌య‌నం ప్ర‌కారం..భారతదేశంలో ఒక్క 2019లోనే 6,99,000 మంది స్ట్రోక్‌తో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 2019 ఏడాదిలో సంభ‌వించిన మొత్తం మ‌ర‌ణాల్లో ఈ బ్రెయిన్ స్ట్రోక్ మ‌ర‌ణాల శాతం 7.4 శాతంగా ఉంది.

దేశంలో న‌మోదైన నాన్ క‌మ్యూనికేబుల్ న్యూరలాజిక‌ల్ డిజార్డర్స్‌, క‌మ్యూనికేబుల్ న్యూర‌లాజిక‌ల్ డిజార్డ‌ర్స్‌, న్యూర‌లాజిక‌ల్ ఇంజ్యూరీస్‌ క‌లిపి మొత్తం న‌రాలకు సంబంధించిన వ్యాధుల వల్ల 1990 – 2019 సంవ‌త్స‌రాల మ‌ధ్య అంటే 29 ఏళ్ల వ్య‌వ‌ధిలో రెండింత‌లు పెరిగిందని ఈ అధ్య‌య‌నం వెల్లడించింది. ఎన్‌సెఫ‌లైటిస్‌, మెనింజైటిస్‌, టెటాన‌స్ లాంటి రుగ్మ‌త‌ల‌ను క‌మ్యూనికేబుల్ న్యూర‌లాజిక‌ల్ డిజార్డ‌ర్స్‌గా పేర్కొన్నారు.

అలాగే..బ్రెయిన్ స్ట్రోక్‌, రక ర‌కాల త‌ల‌నొప్పులు, ఎపిలెప్సీ, సెరిబ్ర‌ల్ పాల్సీ, అల్జీమ‌ర్స్‌, డెమెంటియాస్‌, బ్రెయిన్ అండ్ సెంట్రల్ న‌ర్వ్ సిస్ట‌మ్ క్యాన్స‌ర్‌, పార్కిన్స‌న్స్‌, మ‌ల్టిపుల్ స్క్లెరోసిస్, మోటార్ న్యూరాన్ డిసీజెస్‌, ఇత‌ర న్యూర‌లాజిక‌ల్ డిజార్డ‌ర్ల‌ను నాన్ క‌మ్యూనికేబుల్ డిజార్డ‌ర్లుగా.. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీస్‌, స్పైన‌ల్ కార్డ్ ఇంజ్యూరీస్‌ను ఇంజ్యూరీ రిలేటెడ్ న్యూరలాజిక‌ల్ డిజార్డ‌ర్‌లుగా తాజా అధ్య‌య‌న పేపర్స్ ద్వారా వెల్లడైనట్లుగా పేర్కొన్నారు.

5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సంక్రమణ వ్యాధులు మొత్తం న్యూరోలాజికల్ డిజార్డర్స్ భారంకు దోహదం చేయగా, నాన్-కమ్యూనికేట్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అన్ని ఇతర వయసులలో అత్యధికంగా దోహదపడ్డాయని పేర్కొంది.న్యూరోలాజికల్ డిజార్డర్స్ భారం, అధిక రక్తపోటు, వాయు కాలుష్యం, ఆహార ప్రమాదాలు, అధిక ఉపవాసం ప్లాస్మా గ్లూకోజ్ మరియు అధిక శరీర ద్రవ్యరాశి సూచికలకు తెలిసిన ప్రమాద కారకాలలో ఇది ప్రధాన కారణమని పేర్కొంది.