Coronavirus turned airborne: గాలి ద్వారానే ప్రధానంగా కరోనా వ్యాప్తి..బలమైన ఆధారం దొరికింది.

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

Coronavirus turned airborne: గాలి ద్వారానే ప్రధానంగా కరోనా వ్యాప్తి..బలమైన ఆధారం దొరికింది.

Covid 19

COVID-19 కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గాలి ద్వారానూ కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. కొవిడ్‌-19కు కారణమైన ‘సార్స్‌-కోవ్‌-2’ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న వార్తల మధ్య.. వీటిని నిర్ధరించేందుకు బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం నడుం బిగించింది. కరోనా వైరస్ ప్రధానంగా‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాజాగా ఈ నివేదిక ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమైంది. “లాన్సెట్‌”లో ని కొత్త అంచనా ప్రకారం..కోవిడ్-19కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుందని స్థిరమైన, బలమైన ఆధారాలు కనుగొన్నాయి. గాలి ద్వారానూ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తేల్చే పది విషయాలను నివేదించింది.

ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తున్న వైరస్ కి చికిత్స చేయడంలో విఫలమయ్యే ప్రజారోగ్య చర్యలు(public health measures ) ప్రజలను అసురక్షితంగా వదిలివేస్తాయని మరియు వైరస్ వ్యాప్తి చెందడానికి అనుమతిస్తాయని కోఆపరేటివ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్(CIRES)రసాయన శాస్త్రవేత్త జోస్ లూయిస్ జిమెనెజ్ తో సరసాయన శాస్త్రవేత్త జోస్ లూయిస్ జిమెనెజ్ తో సహా UK, USA మరియు కెనడాకు చెందిన ఆరుగురు నిపుణులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ప్రజారోగ్య సంస్థలు తమ ప్రసార వివరణను శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా మార్చడం అత్యవసరమని…దీని వల్ల వాయు ప్రసారాన్ని తగ్గించడంపై ఎక్కువగా దృష్టిపెట్టొచ్చని బిమెనెజ్ తెలిపారు. కాగా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ట్రిష్ గ్రీన్హాల్గ్ నేతృత్వంలోని నిపుణుల బృందం లాన్సెంట్ లో ప్రచురించిన పరిశోధనలను సమీక్షించింది. గాలి ద్వారా పెరుగుతున్న వ్యాప్తికి మద్దతుగా 10 ఆధారాలను గుర్తించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తికి ముఖ్యంగా సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్లు కారణమవుతున్నాయని తాజా అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్‌ సోకిన ఓ వ్యక్తి నుంచి 53 మందికి సోకిన ఓ ఘటనను నివేదికలో ఉదహరించారు. వైరస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం లేదా అతను తాకిన ప్రదేశాలు, వస్తువులను తాకకుండానే వారందరికీ వైరస్‌ సోకిన విషయాన్ని గుర్తుచేశారు. వారందరిపై జరిపిన అధ్యయనంలోనూ ఇదే విషయం తేలిందని నిపుణులు స్పష్టంచేశారు. గాలిద్వారా వైరస్‌ వ్యాప్తి చెందడమే ఇలాంటి ఘటనకు కారణమని అభిప్రాయపడ్డారు. బాహ్యప్రదేశాల్లో కంటే ఇండోర్‌ ప్రదేశాల్లోనే వైరస్‌ వ్యాప్తి అత్యధికంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఇండోర్‌ ప్రదేశాల్లో సరైన వెంటిలేషన్‌ ఉన్నట్లయితే వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు. అసింప్టమెటిక్‌(లక్షణాలు లేని) వ్యక్తుల నుంచి కరోనా వైరస్‌ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 40శాతం దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు లేనివారి నుంచే ఇతరులకు సోకుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వ్యాపించడానికి ఈ నిశ్శబ్ద వ్యాప్తే ఎంతో కీలకంగా వ్యవహరించిందని.. గాలిలో వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఇది కూడా ప్రధాన కారణంగా కనిపించిందని నిపుణులు వెల్లడించారు. ఒకరినొకరు సన్నిహితంగా మెలగకున్నా.. హోటళ్లలో పక్క గదుల్లో ఉన్న వ్యక్తులకు వైరస్‌ సోకడాన్ని కూడా నిపుణులు ఉదహరించారు.

అయితే, తొందరగా ఉపరితలంపై పడిపోయే పెద్ద బిందువుల నుంచి వైరస్‌ తేలికగా గాలిలో ఎలా ప్రసరిస్తుందనడానికి శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో రుజువు చేయలేకపోయారు. అయినప్పటికీ డైనమిక్స్‌ ఆఫ్‌ ఫ్లుయిడ్‌ ఫ్లోస్, బ్రతికున్న వైరస్‌ను వేరుచేసి జరిపిన పలు అధ్యయనాల నివేదికలను పూర్తిగా విశ్లేషించామని పరిశోధనకు నేతృత్వం వహించిన నిపుణడు గ్రీన్‌హాల్గ్‌ పేర్కొన్నారు. వీటిలో కొన్ని గాలిలో వ్యాప్తిని బలహీనమైనవిగా అంచనా వేసినప్పటికీ.. ఇది సాధ్యమనడానికి బలమైన ఆధారాలెన్నో ఉన్నాయని స్పష్టంచేశారు