Supriya Sule: ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న సుప్రియా సూలె.. కారు దిగి ఏం చేశారో తెలుసా?

సుప్రియ సూలే తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘హడప్సర్ నుండి సస్వాద్ వరకు పాల్కీ హైవేకు తక్షణమే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది.ఇప్పుడు ఇక్కడ ఒక్క కారు ఆగినా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి నెలకొంది’’ అని ట్వీట్ చేశారు. కాగా, ఆ వీడియోలో ఆమె వాహనదారులతో మాట్లాడుతూ ట్రాఫిక్‌ను చక్కదిద్దినట్లు కనిపిస్తోంది.

Stuck in traffic jam, NCP leader Supriya Sule steps off her car and does this

Supriya Sule: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ సుప్రియా సూలె గురువారం పూణెలోని ఒక రోడ్డులో ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్నారు. అయితే దాన్ని అసౌకర్యంగా భావించుకుండా కారు దిగి ట్రాఫిక్ క్లియర్ చేయడం గమనార్హం. వాహనదారులతో ప్రయాణికులతో మాట్లాడుతూ, వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ.. ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమె ప్రభుత్వానికి ఒక విజ్ణప్తి చేశారు.

సుప్రియ సూలే తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘హడప్సర్ నుండి సస్వాద్ వరకు పాల్కీ హైవేకు తక్షణమే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది.ఇప్పుడు ఇక్కడ ఒక్క కారు ఆగినా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి నెలకొంది’’ అని ట్వీట్ చేశారు. కాగా, ఆ వీడియోలో ఆమె వాహనదారులతో మాట్లాడుతూ ట్రాఫిక్‌ను చక్కదిద్దినట్లు కనిపిస్తోంది.

Protest against Jinping: జిన్‭పింగ్‭పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత.. రహస్యంగా టాయిలెట్ల ద్వారా నిరసన