అడిగితే కొడతాం: స్టూడెంట్‌ కుటుంబాన్ని ఉతికారేసిన కాలేజి యాజమాన్యం

అడిగితే కొడతాం: స్టూడెంట్‌ కుటుంబాన్ని ఉతికారేసిన కాలేజి యాజమాన్యం

సాధారణంగా తప్పు చేసిన స్టూడెంట్‌ను మందలించిన కాలేజి సస్పెండ్ చేయడమో.. టీసీ ఇచ్చేయడమో జరుగుతుంటాయి. కొన్నిసార్లు కాలేజిలో తప్పు జరిగితే స్టూడెంట్ కుటుంబాలే బుద్ది చెప్పడం కూడా చూశాం. కానీ, రాజస్థాన్ లోని కాలేజిలో జరిగిన తీరు చూస్తే.. షాక్ కు గురి కావాల్సిందే. 
Read Also : అసలేం జరిగింది : యువజంట సజీవ దహనం

రాజస్థాన్‌ జున్జును జిల్లాలోని చుడాలియా గ్రామంలో ఉన్న ఝబార్మల్ టిబ్రేవాల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం ఆనంద్ అనే విద్యార్థికి ప్రొఫెసర్‌కి మధ్య వాదన పెరగడంతో ప్రొఫెసర్ కొట్టారు. అంతవయస్సు వచ్చిన విద్యార్థి తప్పొప్పులు సరిదిద్దాల్సిందిపోయి కొట్టడం చూసి బంధువులు యూనివర్సిటీకి వెళ్లి ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. 

ఆనంద్, అతని మామ, కజిన్ కలిసి యూనివర్సిటీకి వెళ్లారు. ప్రశ్నించేలోపే వారిని పట్టుకుని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ చిత్తుగా కొట్టింది. నిథి యాదవ్ ఆధ్వర్యంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ పొడుగాటి కర్రను తీసుకుని విరిగేంత వరకూ కొట్టారు. ఒకరు కొడుతుంటే మరి కొందరు సిబ్బంది వారికి సాయంగా నిలిచారు. అన్యాయంగా విద్యార్థిని, వారి కుటుంబాన్ని కొట్టడంపై పోలీసులకు సమాచారం అందింది. వివరాలు తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోనున్నారు. 
Read Also : యువతిపై ప్రేమోన్మాది దాడి: ప్రేమించలేదని కోపం