MP ఒవైసీ సభలో జై..పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు..!!

MP ఒవైసీ సభలో జై..పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు..!!

బెంగళూరులో జరిగిన సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనల్లో ఓ యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలు రచ్చలేపాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సమక్షంలో గురువారం ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’పేరుతో సభ జరిగింది. ఒవైసీ వస్తుండగానే వేదికపైకి వచ్చిన అమూల్య లియోనా అనే మహిళ ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’అని నినాదాలు చేయడం ప్రారంభించింది. ఆందోళనకారులను కూడా తనతో పాటు నినదించమని కోరింది. 

దీంతో వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యువతి అలాగే పలుమార్లు నినాదం చేస్తుండటంతో అసదుద్దీన్ ఓవైసీ వెనక్కి వచ్చి మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా అలాగే నినాదాలు చేస్తూ పోయింది. నిర్వహకులు ఆపడానికి ప్రయత్నిస్తుంటే చివరకీ ‘హిందూస్థాన్ జిందాబాద్’ అని మాట మార్చింది.  అయినప్పటికీ ఆమె నుంచి మైక్ లాక్కోవడంతో పాటు వెనక్కి తీసుకెళ్లిపోయారు పోలీసులు. 

సదరు యువతిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 124 కింద కేసు నమోదు చేశారు. ఆమెను ప్రశ్నించిన అనంతరం జడ్జి ముందు హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తరలిస్తుండగా.. అక్కడున్నవారు పెద్దగా అరిచారు. తర్వాత ప్రసంగించిన అసదుద్దీన్.. మహిళతో, ఆమె అభిప్రాయాలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అటువంటి వాళ్లను కార్యక్రమానికి ఆహ్వానించకుండా ఉంటే బావుండేదన్నారు. 

‘ఆమె ఇలా ప్రవర్తిస్తారని తెలిస్తే.. నేను ఈ కార్యక్రమానికి వచ్చేవాడిని కాదు. మేం భారతీయులం. శత్రుదేశం పాకిస్తాన్‌కు మద్దతిచ్చే ప్రశ్నే లేదు. భారత్‌ను కాపాడాలనేదే మా ఉద్యమం ఉద్దేశం’ అని ఓవైసీ వివరించారు. ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలన్నీ పాకిస్తాన్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని జాతివ్యతిరేక శక్తుల మధ్య జాయింట్‌ వెంచర్‌లో భాగమని ఆరోపించింది. బెంగళూరు ఘటనను కాంగ్రెస్‌ కూడా ఖండించింది.  
 

Read More>>పాయిజన్ కలిసిన దగ్గు మందు తాగి 9 మంది మృతి

See Also>>“పాకిస్తాన్ జిందాబాద్” వ్యాఖ్యలు చేసిన యువతికి నక్సల్స్ తో సంబంధాలు