students: పాకిస్తాన్ డిగ్రీలు ఇండియాలో చెల్లవు: కేంద్రం

పాక్ డిగ్రీలతో భారత్‌లో పై చదువులు చదవడం కానీ, ఉద్యోగాలు పొందడం కానీ చేయలేరని చెప్పింది. అయితే, పాకిస్తాన్ నుంచి భారత్ వలస వచ్చిన విద్యార్థులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందని ప్రకటనలో యూజీసీ, ఏఐసీటీఈ పేర్కొన్నాయి.

students: పాకిస్తాన్ డిగ్రీలు ఇండియాలో చెల్లవు: కేంద్రం

Students

students: ఉన్నత చదువుల కోసం పాకిస్తాన్ వెళ్లే భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చింది కేంద్రం. ప్రభుత్వ అనుబంధ విభాగాలైన ‘ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)’, ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)’ సంయుక్తంగా ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం పాకిస్తాన్‌లో భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు చదవకూడదని, అక్కడి డిగ్రీలు దేశంలో చెల్లుబాటు కావని పేర్కొంది.

 

పాక్ డిగ్రీలతో భారత్‌లో పై చదువులు చదవడం కానీ, ఉద్యోగాలు పొందడం కానీ చేయలేరని చెప్పింది. అయితే, పాకిస్తాన్ నుంచి భారత్ వలస వచ్చిన విద్యార్థులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందని ప్రకటనలో యూజీసీ, ఏఐసీటీఈ పేర్కొన్నాయి. దీనికోసం భారత్ జారీచేసే సెక్యూరిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలని చెప్పింది.