BHU: వారణాసి వర్సిటీలో హోలీపై నిషేధం.. అయినా హోలీ నిర్వహించిన విద్యార్థులు

గత ఏడాది వీసీ ఇఫ్తార్ పార్టీ ఇచ్చారని, హోలీపై నిషేధం విధించి ఇఫ్తార్ పార్టీ ఎలా నిర్వహించారని కొంత మంది విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బీహెచ్‌యూ హాస్టల్‌లో హోలీకి ముందు కలకలం నెలకొంది. రెండు విద్యార్థి సమూహాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ, రాళ్ల దాడిలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. దీనిపై యాజమాన్యం విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

BHU: వారణాసి వర్సిటీలో హోలీపై నిషేధం.. అయినా హోలీ నిర్వహించిన విద్యార్థులు

Students play Holi inside BHU campus, violate proctor’s order

BHU: ఈ నెల 8న హోలీ వేడుకలు చేసుకునేందుకు దేశమంతా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వరణాసి బనారస్ హిందూ యూనివర్శిటీ విద్యార్థులకు ఈసారి హోలి వేడుకలు లేనట్టే. యూనివర్సిటీ పరిధిలో హోలీ వేడుకలపై యాజమాన్యం నిషేధం విధించింది. ఈ మేరకు యూనివర్శిటీ వైస్ ఛాన్సులర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీ జారీ చేసిన ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హెచ్చరించింది. అయినప్పటికీ విద్యార్థులు అవేమీ పట్టించుకోకుండా హోలీ చేసుకున్నారు.

CJI Chandrachud: తప్పుడు వార్తల ప్రవాహంలో నిజం బలిపశువుగా మారుతోంది.. సీజేఐ చంద్రచూడ్

యూనివర్శిటీ నిషేధ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ కొంత మంది విద్యార్థులు హాస్టళ్లలో హోలీ జరుపుకున్నారు. డీజే సంగీతం మధ్య విద్యార్థులు రంగులు చల్లుకున్నారు. బీహెచ్‌యూలో నిషేధం విధించిన తర్వాత కూడా విద్యార్థులు హోలీ ఆడటం గమనార్హం. ఇక యూనివర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అన్యాయమని యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు అభయ్‌సింగ్‌ అన్నారు.

Bamboo Crash Barrier: బంబూ కర్రలతో రోడ్డు బారియర్.. వైరల్ అవుతున్న ఫొటోలు