Lockdown : పోర్న్ చూసి పాడవుతున్న విద్యార్థులు

కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు ఆన్‌లైన్‌ లోనే క్లాసులు వింటున్నారు. వారి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో చాలామంది అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూస్తున్నట్లుగా సైబర్ అధికారులు గుర్తించారు. గత ఏడాది కాలంగా అశ్లీల వీడియో చూసేవారి సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు.

Lockdown : పోర్న్ చూసి పాడవుతున్న విద్యార్థులు

Porn Videos

Lockdown : కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు ఆన్‌లైన్‌ లోనే క్లాసులు వింటున్నారు. వారి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో చాలామంది అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూస్తున్నట్లుగా సైబర్ అధికారులు గుర్తించారు. గత ఏడాది కాలంగా అశ్లీల వీడియో చూసేవారి సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. చాలామంది పిల్లలు, టీనేజర్లు అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూడడం అలవాటు చేసుకున్నట్లు  సైబర్ అధికారులు చెబుతున్నారు. గతంతో పోల్చితే లాక్ డౌన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్న వారి సంఖ్య పెరిగినట్లు పేర్కొన్నారు.

కాగా అశ్లీల వీడియోలు చూస్తున్నట్లుగా నిర్దారణ అయితే శిక్షలు కఠినంగా ఉంటాయి. సాంకేతిక చట్టం 67బీ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. పిల్లల పోర్న్ వీడియోలు చూసే వారికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధిస్తారు. అదే వ్యక్తి రెండోసారి పట్టుబడితే ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. పెద్దల వీడియోలు చూడటం కూడా నేరమే.. వీరిని కూడా చట్టప్రకారం శిక్షిస్తారు. మూడేళ్ళ జైలు శిక్ష.. రూ10 లక్షల జరిమానా విధిస్తారు. రెండవసారి పట్టుబడితే ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.

లాక్ డౌన్ సమయంలో అశ్లీల వీడియోలు చూస్తున్నవారి సంఖ్య ఎక్కువైందని గణాంకాలు చెబుతున్నాయి. డేటా వినియోగం కూడా ఎక్కువైనట్లు గుర్తించారు. పోర్న్ వీడియోలు చూస్తున్న వారిని కర్ణాటక సీఐడీ అధికారులు గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మందిని ఇటీవల అధికారులు విచారించారు. 18 ఏళ్ల లోపు పిల్లలు పోర్న్ వీడియోలు చూస్తే తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అధికారులు చెబుతన్నారు.