Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం : రాహుల్ గాంధీ

ప్రస్తుత ప్రభుత్వం భారత యువత భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గాయని పేర్కొన్నారు. బీజేపీలో దళితులకు స్థానం లేకుండా పోయిందన్నారు.

Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం : రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఏ విషయంపై అయినా అంతర్గత చర్చ ఉంటుందని అన్నారు. ఇతర పార్టీల్లో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో ఇంత స్వేచ్ఛగా చర్చించుకునే అవకాశమే లేదని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థలను నాశనం చేస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. న్యాయ, ఎన్నికల వ్యవస్థలను ఒత్తిడిలో పెడుతున్నారని తెలిపారు.

కానీ వాటి తర్వాతి పరిణామాలపై దృష్టి పెట్టడం లేదన్నారు. భావ స్వేచ్ఛను అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని వెల్లడించారు. కాంగ్రెస్‌లో సరికొత్త మార్పులు రాబోతున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం భారత యువత భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గాయని పేర్కొన్నారు. బీజేపీలో దళితులకు స్థానం లేకుండా పోయిందన్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతున్నారా?

మరోవైపు ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈవీఎంల వ్యవహారంపై సీడబ్ల్యూసీలో చర్చించి నేతలు.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తిపలికి పేపర్‌ బ్యాలెట్ తీసుకురావాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ఈ అంశంపై భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చించాలని నిర్ణయిం తీసుకున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. బ్లాక్‌ స్థాయి నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటి వరకు నిర్ణీత పదవీకాలం ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ అధ్యక్షుడికి సహాయ పడేందుకు కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీలో యువతకు ప్రాతినిధ్యం పెంచాలని నిర్ణయించారు. పార్టీలో 50 శాతం యువతకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ స్థాయి వరకు 50 శాతం యువత ఉండేలా చర్యలు తీసుకోకున్నారు. 50 శాతం యువత కోటాలో ఎస్ సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకూ చోటు కల్పించాలని నిర్ణయించారు.

Rahul in Warangal: అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: ప్రకటించిన రాహుల్ గాంధీ

యువతకు ప్రాధానిధ్యం పెంచాలని సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తగా పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయాలన్న G23 నేతల సూచనకు ఆమోదముద్ర వేశారు. పార్టీలో ప్రియాంకగాంధీ పాత్రను పెంచడంపైనా సీడబ్ల్యూసీలో చర్చిచారు. మొత్తంగా 20 ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది.