Subhadra Kumari Chauhan : సుభద్ర కుమారి చౌహాన్ కు గూగుల్‌ డూడుల్స్‌ గౌరవం..

స్వాతంత్ర పోరాటంలో అరెస్ట్‌ అయిన మొదటి మహిళా సత్యాగ్రహి సుభద్ర కుమారి చౌహాన్ కు గూగుల్‌ డూడుల్స్‌ గౌరవాన్ని ఇచ్చింది. ఆగస్టు 16 ఆమె 117వ జయంతి.

Subhadra Kumari Chauhan : సుభద్ర కుమారి చౌహాన్ కు గూగుల్‌ డూడుల్స్‌ గౌరవం..

Subhadra Kumari Chauhan

Subhadra Kumari Chauhan : స్వాతంత్ర పోరాటంలో అరెస్ట్‌ అయిన మొదటి మహిళా సత్యాగ్రహి సుభద్ర కుమారి చౌహాన్ కు గూగుల్‌ డూడుల్స్‌ గౌరవాన్ని ఇచ్చింది. ఆగస్టు 16 ఆమె 117వ జయంతి సందర్భంగా గూగుల్‌ ఇండియా.. గూగుల్‌ డూడుల్‌తో గౌరవించింది. దేశ స్వాత్రంత్ర్యం కోసం ఎంతోమంది త్యాగధనులు వారి జీవితాలను ప్రాణాలకు కూడా పణ్ణంగా పెట్టారు. దేశానికి స్వాత్రంత్ర్యం సాధించారు.ఈ పోరాటంలో కుటుంబాలను వదిలేసుకుని దేశం కోసం అంకితమైపోయాని త్యాగధనుల పోరాట ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నాం. ఈ పోరాటంలో మహిళల పాత్ర అత్యంత కీలకమనే చెప్పాలి. మహిళలు లేని ఉద్యం అసంపూర్ణం అని ఎంతోమంది పోరాట యోధులు చెప్పారు. అలా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అరెస్ట్‌ అయిన మొదటి మహిళా సత్యాగ్రహి సుభద్ర కుమారి చౌహాన్. నిన్న ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం దినోత్సవం. ఈరోజు ఆగష్టు 16న సుభద్రా కుమారి చౌహాన్ 117వ జయంతి. ఈ సందర్భంగా సుభద్రాకుమారికి గూగుల్‌ డూడుల్‌ గౌరవాన్ని అందిస్తోంది.

తన కవితలతో ఎంతోమందిలో బ్రిటిష్‌ వ్యతిరేక పోరాట స్ఫూర్తిని నింపామరు సుభద్ర కుమారి చౌహాన్‌. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుభద్ర.. స్వాతంత్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నారు. స్వతహాక కవయిత్రి అయిన సుభద్రాకుమారి భర్త ప్రోత్సాహంతో పిల్లలకు కూడా అర్థం అయ్యేలా బ్రిటీష్ పాలను వ్యతిరేకంగా కవితలు రాసేవారు. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల స్కూల్‌ సిలబస్‌ పుస్తకాల్లో కనిపించే పాఠం.. ‘ఝాన్సీ కీ రాణి’. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్(మణికర్ణిక) పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కవిత్వాన్ని రాసింది మరెవరో . సుభద్ర కుమారి చౌహాన్‌. ప్రముఖ హిందీ కవయిత్రిగా, స్వాతంత్ర సమర యోధురాలిగా ఆమె పేరు భారత చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయింది.

అరెస్టైన మొదటి సత్యాగ్రహి సుభద్రాకుమారి
యూపీ ప్రయాగ్‌రాజ్‌ నిహల్‌పూర్‌ గ్రామంలో ఓ రాజ్‌పుత్‌ కుటుంబంలో 1904, ఆగష్టు 16న పుట్టింది సుభద్ర కుమారి. తొమ్మిదేళ్లకే కవితలు రాసేసి అందరిని అబ్బురపరిచేవారు. ‘నీమ్‌’ కవితతో సాహిత్య ప్రపంచంతో ‘చిచ్చురపిడుగు’ బిరుదు అందుకున్నారు. 17 ఏళ్ల వయసులో థాకూర్‌ లక్క్ష్మణ్‌ సింగ్‌ చౌహాన్‌ను వివాహం చేసుకుని.. జబల్‌పూర్‌ లో కాపురం పెట్టారు. భర్త ప్రోత్సాహంతో మరింతగా కవిత్వాలు రాస్తూ.. బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నాగ్‌పూర్‌లో బ్రిటిష్‌ వాళ్లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఆమెను అరెస్ట్‌ చేశారు. నాగ్‌పూర్‌ కోర్టు ఆదేశాలతో సుభ్రదను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు.

అరెస్ట్ అయ్యే సమయానికి సుభద్ర గర్భవతి. దీంతో ఆమె జైలునుంచి విడుదల చేశారు. ఆ తరువాత 1941లో సుభద్ర కుమారి భర్త థాకూర్‌, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకున్నారు. అప్పటికే సుభద్రా చౌహాన్ దంపతులకు ఐదుగురు పిల్లలు పుట్టారు. అయినా ఉద్యమంలో పాల్గొనటానికి ఆమె ఏమాత్రం వెనుకాడలేదు. తమ పిల్లల భవిష్యత్తు ఏం అయిపోతుందోననే భయపడలేదు. భర్తతో పాటు ఆమె కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమెను 1942లో మరోసారి అరెస్ట్ చేశారు. ఉద్యమంలో పాల్గొంటూనే అంటరానీతనం, కుల వ్యవస్థ, పర్దా పద్ధతులకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు సుభద్రాకుమారి.

చిన్నారులకు సైతం అర్థం అయ్యేలా బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కవితలు
హిందీ కవిత్వంలో సుభద్రాకుమారిది ప్రత్యేకమైన శైలి. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలనే కాకుండా పిల్లలకు కూడా అర్థమయ్యేలా కవితలు..ఇతర రచనలు రాయటం ఆమె ప్రత్యేకత. వీరనారి ఝాన్సీ రాణి పోరాటస్ఫూర్తి సుభద్రాకుమారి ఆమె కలం నుంచి జాలువారిందే. ‘ఝాన్సీ కీ రాణి’..అనే పేరుతో హిందీ సాహిత్యంలో సుభద్రాకుమారి రాసిని రచన సుస్థిరంగా నిలిచిపోయింది. ‘జలియన్‌ వాలా బాగ్‌ మే వసంత్‌’, ‘వీరోన్‌ కా కైసా హో బసంత్‌’, ‘రాఖీ కీ చునౌతీ’, ‘విదా’ తదితర కవిత్వాలు స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించాయి. ఆమె రాసిన చిన్న చిన్న కథలు పిల్లలను బాగా ఆకట్టుకునేవి.
స్వాతంత్ర్యం తరువాత సుభద్రాకుమారి సెంట్రల్‌ ప్రావిన్స్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1948, ఫిబ్రవరి 15న అసెంబ్లీ సమావేశాలకు నాగ్‌పూర్‌ వెళ్లి జబల్‌పూర్‌కు తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్‌ లోని సియోని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

సుభద్ర కుమారి చౌహాన్‌ కు గూగుల్‌ డూడుల్స్‌ గౌరవం
సుభద్ర కుమారి చౌహాన్‌ మరణాంతరం తరువాత ఆమెకు ఎన్నో గౌరవాలు దక్కాయి. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ షిప్‌కు ‘ఐసీజీఎస్‌ సుభద్ర కుమారి చౌహాన్‌’ పేరు పెట్టారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం జబల్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 1976లో భారత పోస్టల్‌ శాఖ.. ఓ పోస్టల్‌ స్టాంప్‌ రిలీజ్‌ చేసింది. 2021లో 117వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్‌ ఇండియా.. గూగుల్‌ డూడుల్‌తో గౌరవించింది.

సుభద్రాకుమారి కుమార్తె సుధా చౌహాన్‌. ఆమె భర్త ఎవరో కాదు.. లెజెండరీ రచయిత ప్రేమ్‌ చంద్‌ కొడుకు అమృత్‌ రాయ్‌. తల్లిదండ్రుల జీవిత చరిత్ర ఆధారంగా సుధా ‘మిలా తేజ్‌ సే తేజ్‌’ అనే పుస్తకం రాసారు. సుధా-అమృత్‌ల కొడుకు అలోక్‌ రాయ్‌ ఇంగ్లీష్ ప్రొఫెసర్‌. అలోక్ రాయ్ భారత రాజకీయాలు, కల్చర్‌ మీద కాలమ్స్‌ రాస్తున్నారు.