Subramanian swamy : స్వామి సంచలన ట్వీట్.. యూపీలో రాష్ట్రపతి పాలన?

యూపీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో ఎన్నికలపై ఆలోచించాలని అలహాబాద్ కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది.

Subramanian swamy : స్వామి సంచలన ట్వీట్.. యూపీలో రాష్ట్రపతి పాలన?

Subramanian Swamy

Subramanian swamy : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దేశంలోని 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ ఒకటి. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలపై నీలిమేఘాలు అలుముకున్నాయి. ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన అలహాబాద్‌ హైకోర్టు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సభలపై ప్రధాని నరేంద్ర మోదీకి కూడా సూచనలు చేసింది కోర్టు. ఎన్నికలు జరపడం వల్ల మహమ్మారి తీర్వరూపం దాల్చే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి తెలిపింది కోర్టు. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి యూపీ ఎన్నికలపై స్పందించిన తీరు సంచలనంగా మారింది. శుక్రవారం ఆయన చేసిన ట్వీట్ పొలిటికల్‌ హీట్ పెంచింది.

చదవండి : Uttar Pradesh IT Raids : యూపీలో ఐటీ దాడులు.. మాజీ సీఎం అఖిలేశ్‌ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు

యూపీలో రాష్ట్రపతి పాలన రాబోతోంది… అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడబోతున్నాయి అంటూ ట్విట్టర్ వేదిక తన అభిప్రాయాలను పంచుకున్నారు స్వామి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు స్వామి. “ఒమిక్రాన్‌తో లాక్‌డౌన్, యూపీలోలో రాష్ట్రపతి పాలన.. యూపీ ఎన్నికలను సెప్టెంబర్‌కు వాయిదా వేయడం గురించి ఆశ్చర్యపోకండి.. ఈ సంవత్సరం ప్రారంభంలో నేరుగా చేయలేనిది వచ్చే ఏడాది ప్రారంభంలో పరోక్షంగా చేయవచ్చు” అంటూ రాసుకొచ్చారు.

చదవండి : Uttar Pradesh : ఎంత నాణ్యతో..!? : ఓపెనింగ్‌ రోజు టెంకాయ కొడితే పగిలిన కొత్త రోడ్డు

ఇక ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా..2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 300లకుపైగా స్థానాలను కైవసం చేసుకుంది. ఈ సారి కూడా అదే ఊపు కొనసాగించాలని చూస్తుండగా.. ఒమిక్రాన్ కారణంగా ఎన్నికలే జరిగేలా కనిపించడం లేదు. ఒకవేళ ఎన్నికలు వాయిదా పడితే రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన అనివార్యమవుతుంది. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.