పార్లమెంట్ క్యాంటీన్ లో సబ్సీడీ ఎత్తివేత..29నుంచి బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ క్యాంటీన్ లో సబ్సీడీ ఎత్తివేత..29నుంచి బడ్జెట్ సమావేశాలు

Parliament canteen పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారైంది. జనవరి- 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో… రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్​సభ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సమావేశమవుతుందని తెలిపారు. సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం(క్వశ్చన్ అవర్) ఉంటుందని స్పష్టం చేశారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఎంపీలందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని ఓంబిర్లా సూచించారు. అదేవిధంగా, ఎంపీలకు ఆర్​టీపీసీఆర్ కోవిడ్-19 టెస్ట్ లు నిర్వహించేందుకు వారివారి ఇళ్లకు దగ్గర్లో తగిన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపీల కుటుంబ సభ్యులు, సిబ్బందికీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఆవరణలో జనవరి 27-28 తేదీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు..ఈ రెండు రోజుల్లో పార్లమెంట్ ఆవరణలో ఆర్​టీపీసీఆర్ టెస్ట్ లు జరుగుతాయని వెల్లడించారు. సభ్యుల ఇంటి వద్ద సైతం కొవిడ్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

మరోవైపు, పార్లమెంట్ క్యాంటీన్​లో ఎంపీలకు మరియు ఇతరులకు అందించే సబ్సిడీని నిలిపివేసినట్లు మంగళవారం ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ క్యాంటీన్​ను ఇక నుంచి ‘నార్తన్ రైల్వే’కు బదులు ‘ఇండియన్ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్’ నిర్వహిస్తుందని వెల్లడించారు. సబ్సీడీని నిలిపివేయడం ద్వారా లోక్ సభ సెక్రటేరియట్ కి ఏటా 8కోట్లకు రూపాయలకు పైగా ఆదాయం ఆదా అవుతుందని సమాచారం.