Prithvi-2 : పృథ్వీ-2 బాలిస్టిక్‌ మిస్సైల్‌ పరీక్ష సక్సెస్

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేసింది. పృథ్వీ-2 క్షిపణి 350 కిలోమీటర్ల వరకు.. 500-1000 కిలోల వరకు వార్‌హెడ్‌ను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగివుంది.

Prithvi-2 : పృథ్వీ-2 బాలిస్టిక్‌ మిస్సైల్‌ పరీక్ష సక్సెస్

Pritvi 2

Prithvi-2 Missile : పృథ్వీ-2 బాలిస్టిక్‌ మిస్సైల్‌ పరీక్ష సక్సెస్ అయింది. మిస్సైల్‌ పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం (జూన్15,2022) రాత్రి 7.40 గంటలకు మిస్సైల్‌ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేసింది. పృథ్వీ-2 క్షిపణి 350 కిలోమీటర్ల వరకు.. 500-1000 కిలోల వరకు వార్‌హెడ్‌ను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగివుంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్‌.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ద్రవ ఇంజిన్లు ఉన్నాయి.

Agni Prime : జయహో భారత్, అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్..ప్రత్యేకతలు

ట్రైనింగ్‌ లాంచ్‌లో మిస్సైల్‌ కచ్చిత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 9 మీటర్ల పొడవు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేసే పృథ్వీ-2 మిస్సైల్‌ తొలిసారిగా 1996లో ప్రయోగించారు. 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన మొదటి క్షిపణి ఇదే.