CAA ఎఫెక్ట్ : బర్త్, డెత్ సర్టిఫికేట్స్ కోసం క్యూ

  • Published By: madhu ,Published On : January 10, 2020 / 11:57 AM IST
CAA ఎఫెక్ట్ : బర్త్, డెత్ సర్టిఫికేట్స్ కోసం క్యూ

కేంద్రం తీసుకొచ్చిన CAAపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే..డెత్, బర్త్ సర్టిఫికేట్ల కోసం ప్రజలు సంబంధిత కార్యాయాల ఎదుట క్యూలు కడుతున్నారు. తమకు సర్టిఫికేట్స్ జారీ చేయాలని కోరుతున్నారు. 2019, డిసెంబర్ నెలలో అత్యధికంగా సర్టిఫికేట్లు జారీ చేయడం ఇందుకు నిదర్శనం. ఇదంతా యూపీ రాష్ట్రంలో చోటు చేసుకొంటోంది. ప్రధానంగా మైనార్టీ వర్గాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పౌరసత్వాన్ని నిరూపించడానికి సంబంధిత పత్రాలు ఉండాలనే నిబంధనతో జనాలు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. 1968లో జన్మించిన వారు దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. 

తాను 1968లో జన్మించినట్లు, కానీ తనకు బర్త్ సర్టిఫికేట్ అవసరం పడలేదని సర్ఫరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన CAA, NRC, NPR చట్టాలకు అనుగుణంగా తన జాతీయతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే తాను ఆగ్రా నగర్ నిగమ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్‌కు వచ్చి దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. 

ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా దరాఖాస్తుల దారులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది ఫాంలు నింపడానికి న్యాయవాదుల హెల్ప్ కోరుతున్నారు. లక్నోలో 2019, డిసెంబర్ నెలలో జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్స్ మూడు రెట్లు పెరిగిందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నెలలో 6 వేల 193 సర్టిఫికేట్స్‌ను లక్నో మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసింది. జన్మించిన శిశువులు కోసం, వృద్దుల కోసం ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ముస్లింలున్నారు. 

జనన, మరణ ధృవీకరణపత్రాల కోసం డిమాండ్ పెరిగిందని లక్నో మున్సిపల్ అధికారి అశోక్ సింగ్ వెల్లడించారు. 30 శాతం 40 ఏళ్లకు పైబడిన వారున్నారని తెలిపారు. పుట్టిన బిడ్డకు జనన ధృవీకరణపత్రం పొందడం వృద్ధుడి కంటే చాలా సులభమని, కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తి జన్మించిన ఆస్పత్రి సర్టిఫికేట్ అవసరం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ త్రిపాఠి వ్యాఖ్యానించారు. కానీ చాలా మంది ఇంట్లోనే జన్మించారంటూ..అఫిడవిట్లు తయారు చేస్తున్నారని తెలిపారు. ఇతరులు ఆధార్, ఓటర్ ఐడెంటిడీ కార్డు, మార్క్ షీట్, హై స్కూల్ సర్టిఫికేట్, పాస్ పోర్టు, ఇతర సర్టిఫికేట్లతో వస్తున్నారని వెల్లడించారు. 

సీఏఏ వివాదం తర్వాత పౌరసత్వాన్ని రుజువు చేసేందుకు తాను దరఖాస్తు చేసుకోవడం జరిగిందని 57 సంవత్సరాల నియాజ్ అహ్మద్ వెల్లడించారు. జనన ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి తన అడ్వకేట్‌ను తీసుకరావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దరఖాస్తు దారుల్లో అధిక శాతం ముస్లింలున్నారని, వీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదని బర్త్, డెత్ సెక్షన్ క్లర్క్ రషీద్ ఖాన్ తెలిపారు. 

జనన ధృవీకరణపత్రాల డిమాండ్ మూడు రెట్లు పెరగడం CAA, NRC కారణంగా ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నారో అర్థమౌతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖేష్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. PMCలోని ఐదు మండల కార్యాలయాల్లో ప్రతి రోజు సగటున 25 దరఖాస్తులు వస్తున్నాయని, CAA, NRC నేపథ్యంలో చాలా మంది దరఖాస్తుదారులు క్యూలు కడుతున్నారని పీఎంసీ గుమాస్త తెలిపారు.

సంగం సిటీలోని ఐదు జోనల్ ఆఫీసులో 30 ప్లస్ ఉన్న వారు కూడా బర్త్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వీటిలో ఎక్కువ భాగం ముస్లింల నుంచి వచ్చనవన్నారు. అయితే..ధృవపత్రాల డేటా, ఇతరత్రా విషయాలను క్రోడీకరించడం చాలా కష్టమైన పని అన్నారు. 

Read More : BREAKING NEWS : రాజమండ్రిని 4వ రాజధాని చేయాలి – మంత్రి రంగనాధరాజు