Tomato Cultivation : టమాటా సాగుకు అనువైన రకాలు

పొదరకాలు ; పూసా ఎర్లీ డ్వార్ష్, పూసా గ్రారావ్, పూసా సాదబాహర్, రత్న రూపాలు, అవినాష్ 2, కో3, హిస్సార్ లలిమ, రజని, రోమా మొదలైనవి పొద రకాలు.

Tomato Cultivation : టమాటా సాగుకు అనువైన రకాలు

Tamoto

Tomato Cultivation : కూరగాయ పంటల్లో టమాటా ఒకటి. కూరజాతికి చెందిన టమోటాను నిత్యం వంటల్లో వినియోగిస్తుంటారు. టమాట పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగుకు అనుకూలంగా ఉంటుంది. అధిక దిగుబడికి శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతానికి తట్టుకోలేదు. బాగా నీరు ఇంకే గరపనేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. టామాటా సాగుకు సంబంధించి ప్రస్తుతం అనేక విత్తన రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు విత్తనజాతులను ఎంపిక చేసుకుని సరైన సస్యరక్షణ చర్యలు చేడితే మంచి దిగుబడులను సాధించవచ్చు.

సాగుకు అనువైన రకాలు

పూసారుబి ; ఈ రకం నాటిన 60 నుండి 65 రోజులకే కోతకు వస్తుంది. పంట 130 నుండి 135 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది.

పూసా ఎర్లీ డ్వార్ఫ్ ; ఈ రకం నాటిన 60 రోజుల లోపే కాపుకు వస్తుంది. దీని పంటకాలంలో 125 రోజుల నుండి 130 రోజల వరకు ఉంటుంది. ఎకరాకు 10 నుండి 12 టన్నుల దిగుబడినిస్తుంది. ఈపంటను తొలకరి వర్షాల్లో పండించటానికి అనుకూలంగా ఉంటుంది.

ఆర్కా వికాస్ ; ఈ రకం ఖరీఫ్ కాలానికి అనువైనది. 105 రోజుల నుండి 110 రోజుల కాలపరిమితిని కలిగి ఉంటుంది. కాయ బరువు 80 నుండి 85 గ్రాముల వరకు ఉంటుంది. ఎకరానికి 14 నుండి 16 టన్నుల దిగుబడినిస్తుంది.

పి.కె.ఎం 1; ఈ రకం అన్ని కాలాల్లో పండించటానికి అనుకూలంగా ఉంటుంది. దీని కాలపరిమితి 135 రోజులు. ఎకరానికి 12.8 టన్నుల దిగుబడివస్తుంది. ఈ రకం మొక్కలు చిన్నవిగా ఉండటం వల్ల ఎకరానికి ఎక్కవ మొక్కలు నాటుకునే అవకాశం ఉంటుంది.

మారుతమ్ ; ఈ రకం కాయలు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి ఫిబ్రవరి, మార్చిలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఎకరానికి 8 నుండి 10 టన్నుల దిగుబడినిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలకు అనువైనది.

పూసా రోహిణి ; ఈ రకం ఎక్కవ రోజులు నిల్వ ఉంటుంది. ఎకరాకు 16.5టన్నుల దిగుబడి వస్తుంది.

పూసా హైబ్రిడ్ 4 ; ఈ రకం నులిపురుగులను తట్టుకునే శక్తి కలిగి ఎకరాకు 10 నుండి 14 టన్నుల దిగుబడినిస్తుంది.

పూసా సదా బహార్ ; ఈ రకం 8 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న వాతావరణంలో పెరగటానికి అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 10 నుండి 14 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.

పొదరకాలు ; పూసా ఎర్లీ డ్వార్ష్, పూసా గ్రారావ్, పూసా సాదబాహర్, రత్న రూపాలు, అవినాష్ 2, కో3, హిస్సార్ లలిమ, రజని, రోమా మొదలైనవి పొద రకాలు.

తీగరకాల; అర్క సొరబ్, ఆర్క వికాస్, పూసా రూబీ, పూసా ఉపహల్, పంత్ మహల్, పూసా దివ్య ఇవి తీగరకాలు.

సంకరజాతి రకాలు ; అవినాష్, నవీన్, రూపాలి, రిషి, అభిమాన్, మనమోహన్, మినాషి, లారీక, బి,యస్.యస్ 20, వైశాలి, రష్మీ, యంటిహెచ్ 6, మంగళ, పూసా హైబ్రాడ్ 1, అర్క వర్ధన్, అర్కా విశాల్ తదితర రకాలు సంకరజాతి రకాలు

పూసా రూబీ, పూసా ఎర్లీ డ్వార్ఫ్ , అర్క వికాస్, అర్క సేరభ్ లు శీతాకాలంలో సాగుకు అనువైనవి గా చెప్పవచ్చు. మారుతమ్ , పికెఎం1, అర్క వికాస్, అర్క సేరభ్ లు వేసవి కాలంలో సాగుకు అనువుగా ఉంటాయి.