Sukhesh Chandrasekhar: జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖ.. కవిత, కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు

త్వరలో విడుదల కానున్న కేజ్రీవాల్ ఫేస్‌టైమ్ చాట్‌ల స్క్రీన్ షాట్‌లను ఆస్వాదించండి అంటూ తాను రాసిన లేఖలో సుఖేశ్ చంద్ర శేఖర్ పేర్కొన్నారు.

Sukhesh Chandrasekhar: జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖ.. కవిత, కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు

SUKHESH CHANDRASEKHAR

MLC Kavitha: మనీలాండరింగ్ కేసులో అరెస్టై మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు. ఆ లేఖను అతని న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖలో సుఖేశ్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. జైలు ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా ఖైదీ కాలింగ్ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని, అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకు జైలు పాలకవర్గం తప్పుడు సమాచారం ఇస్తుందని సుఖేశ్ లేఖలో పేర్కొన్నారు. కేజ్రీవాల్ నివాస ఖర్చులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాను కాబట్టి నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నేను నా వాళ్ళకి కాల్స్ చేయడానికి వెళ్ళినపుడు ఎప్పుడూ హెడ్ వార్డెన్, అసిస్టెంట్. సూపరింటెండెంట్, ITBP స్టాఫ్ ఉంటారు. నేను ఫోన్‌ను ట్యాంపర్ చేయడం ఎలా సాధ్యం అని సుఖేశ్ ప్రశ్నించారు.

MLC Kavitha : సుకేశ్‌ వాట్సాప్‌ చాట్స్‌పై కవిత రియాక్షన్‌

జైలు సృష్టించిన కథలన్నీ అబద్ధం. బాలీవుడ్ థ్రిల్లర్ చిత్రంకోసం మాత్రమే సరిపోతాయి. నేను ఫోన్ కాల్ సదుపాయాన్ని తారుమారు చేయలేదు, దుర్వినియోగం చేయలేదు. నాతల్లి అధీకృత నంబర్‌ను మినహాయించి నేను డయల్ చేసిన ఒక్క కాల్‌ని నిరూపించమని కేజ్రీవాల్ అతని అవినీతి అధికారులను సవాలు చేస్తున్నా. తప్పు రుజువైతే నేను ఎలాంటి శిక్షనైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అది తప్పని తేలితే కేజ్రీవాల్ అతని అవినీతి అధికారులు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని సుఖేశ్ డిమాండ్ చేశారు. కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌లపై ఇటీవల దాఖలు చేసిన నా ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని జైలు అధికారులు నా కుటుంబానికి పలుమార్లు కాల్ చేయమని నన్ను బలవంతం చేశారు. నేను ఏకంగా మూడు నెలల పాటు ఫోన్‌ను ట్యాంపరింగ్ చేశానని జైలు అధికారులు అంటున్నారు. అది ఎలా సాధ్యం అని సుఖేశ్ ప్రశ్నించారు.

Delhi CM Kejriwal: నేడు సిసోడియా బీజేపీలో చేరితే.. రేపు జైలు నుంచి విడుదల అవుతారు కదా?: కేజ్రీవాల్

నన్ను మానసికంగా ఒత్తిడి చేయడం, వేధించడం కోసం నన్ను మండోలి‌లోని 11వ జైలుకి తరలించారు. దీనికి సూపరిండెంట్ ఓం ప్రకాష్ నాయకత్వం వహించారు అని సుఖేశ్ ఆరోపించాడు. కేజ్రీవాల్ ఎన్ని ప్రయత్నించినా, ఏం చేసినా నేను వెనక్కి తగ్గను. నేను మీకు ఇచ్చిన ఫర్నిచర్ బిల్లులన్నింటినీ ఈడీ, సీబీఐ అధికారులకు సమర్పిస్తాను. ఎమ్మెల్సీ కవిత డిస్టిలింగ్ షెల్ ఖాతాల నుండి “గ్రీన్ హస్క్” ఇండస్ట్రీస్ మారిషస్, మిస్టర్ కైలాష్ ఘెలోట్ యొక్క కజిన్స్ ఖాతాలకు బదిలీ చేయబడిన మొత్తాలకు సంబంధించి మీ ఫేస్‌టైమ్ చాట్‌ల స్క్రీన్‌షాట్‌లను కూడా నేను సమర్పిస్తాను. మీ సూచనల మేరకు నేను 80 కోట్లు బదిలీ చేసాను. మీకు గుర్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను అని సుఖేశ్ లేఖలో పేర్కొన్నారు.

Kavitha : కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే నాపై దాడి- సుకేశ్‌ వాట్సాప్ చాట్‌లపై కవిత ఫైర్

కేజ్రీవాల్ జీ నిజమైన రంగులు బయటకు వచ్చే మరో ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి. త్వరలో కేజ్రీవాల్‌ను జైలులో చూడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. కేజ్రీవాల్ జీ మీకు స్వాగతం పలికే సమయం దాదాపు ఆసన్నమైంది. మీ అవినీతి జైలు అధికారులు మీకోసం, మీ మిగిలిన సహచరుల‌కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో విడుదల కానున్న కేజ్రీవాల్ ఫేస్‌టైమ్ చాట్‌ల స్క్రీన్ షాట్‌లను ఆస్వాదించండి అంటూ తాను రాసిన లేఖలో సుఖేశ్ చంద్ర శేఖర్ పేర్కొన్నారు.