గుడ్ బై… ఇండోర్ ప్రజలపై బాంబు పేల్చిన లోక్ సభ స్పీకర్

ఇండోర్ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 10:45 AM IST
గుడ్ బై… ఇండోర్ ప్రజలపై బాంబు పేల్చిన లోక్ సభ స్పీకర్

ఇండోర్ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

ఇండోర్ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం (ఏప్రిల్- 5, 2019) ఆమె ఓపెన్ లెటర్ విడుదల చేశారు. వయసు పైబడిన నేతలను లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని బీజేపీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇటీవల ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి పలువురు సీనియర్ నేతలకు పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు.
Read Also : బై..బై బాబు : జగన్ను సీఎం చేయండి – షర్మిల

సుమిత్రా మహాజన్‌ కు కూడా టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే ఈ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అభ్యర్థి ప్రకటన విషయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. ఈ సమయంలో శుక్రవారం ఆమె రాసిన ఓపెన్ లెటర్ లో… బీజేపీ విడుదల చేసిన మొదటి రెండు అభ్యర్థుల జాబితాల్లో ఇండోర్ లేదు.ఇండోర్ కు ఇప్పటివరకు అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదంటూ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.

వెంటనే ఇండోర్ అభ్యర్థిని ప్రకటించాలని ఆ లేఖలో ఆమె విజ్ఞప్తి చేశారు. ఇండోర్ టిక్కెట్ విషయంలో పార్టీ సీనియర్లతో చర్చించానని,తుది నిర్ణయం వారికే వదిలిపెట్టినట్లు ఆమె తెలిపారు.కానీ ఇప్పటికే అధిష్ఠానం ఈ సీటు విషయంలో డైలామాలో ఉందన్నారు.తాను పోటీ చేయడం లేదని సృష్టం చేస్తున్నానని,వెనకడుగు వేయకుండా ఓపెన్ హార్ట్ తో పార్టీ నిర్ణయం తీసుకోవచ్చన్నారు. త్వరలోనే పార్టీ నిర్ణయం తీసుకొని కన్ఫ్యూజన్ కు స్వస్తి పలుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల క్రితం 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సుమిత్రా మహాజన్ రికార్డు స్థాయిలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి 8 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 
Read Also : ఏపీలో ఐటీ దాడులు : రాజకీయ రంగు పులుముతారా – జీవీఎల్