Ayodhya Temple : అయోధ్య మందిరానికి స్పెషల్ డిజైన్.. శ్రీరామనవమి రోజున గర్భగుడిలో సూర్యకిరణాలు

ఒడిషా రాష్ట్రంలోని కోణార్క్​లో ఉన్న సూర్య దేవాలయం స్ఫూర్తితో అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్​ వర్గాలు తెలిపాయి. ప్రతి శ్రీరామ నవమి రోజున

10TV Telugu News

Ram Temple ఒడిషా రాష్ట్రంలోని కోణార్క్​లో ఉన్న సూర్య దేవాలయం స్ఫూర్తితో అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్​ వర్గాలు తెలిపాయి. ప్రతి శ్రీరామ నవమి రోజున గర్భగుడిలోని రాముని విగ్రహంపై సూర్య కిరణాలు పడి, గర్భగుడి అంతటా ప్రకాశించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. శాస్త్రవేత్తలు, జ్యోతిషులు, సాంకేతిక నిపుణులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.

అయోధ్య రామమందిర నిర్మాణంలో సాంకేతిక అంశాలపై పని చేసేందుకు నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ బిల్డింగ్ కన్​స్ట్రక్షన్​ సహా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ ముంబైకి చెందిన నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు కామేశ్వర్ తెలిపారు.

ఇక, ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ట్రస్ట్​కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి భక్తులు దర్శించుకునేందుకు అనుమతి కల్పించనున్నట్లు చెప్పారు.