యూపీలో ఆదివారం లాక్ డౌన్.. మాస్క్ లేకుంటే 10వేలు ఫైన్

n దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

యూపీలో ఆదివారం లాక్ డౌన్.. మాస్క్ లేకుంటే 10వేలు ఫైన్

Sunday Lockdown

Sunday Lockdown దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఈ ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ ని యోగి సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ఆదివారం లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంద‌ని ప్ర‌భుత్వ అధికారులు తెలిపారు. ఆదివారం రోజు కేవలం ఎసెన్షియల్(అత్యవసర)సర్వీసులకు,కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఉంటుందని సృష్టం చేశారు.

క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఉన్న‌తాధికారుల‌తో ఇవాళ వర్చువల్ గా సమావేశమైన సీఎం యోగి ఆదిత్య‌నాథ్.. మాస్క్ లేకుండా మొదటిసారి పట్టుబడినవారికి రూ.1000జరిమానా, రెండోసారి మాస్క్ లేకుండా ప‌ట్టుబ‌డ్డ వారికి రూ.1000 జ‌రిమానా విధించ‌ాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు, కరోనా వైరస్ ప్రారభమైనప్పటినుంచి యూపీలో ఒక్కరోజులో అత్యధిక కేసులు బుధవారం నమోదైన విషయం తెలిసిందే. బుధవారం ఒక్కరోజే 22,439కేసులు,104మరణాలు నమోదయ్యాయి. దీంతో మే-15వరకు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ మూసివేయబడి ఉంటాయని, అదేవిధంగా, రాష్ట్ర బోర్డు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు గురువారం యోగి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక,2వేలకు పైగా యాక్టివ్ కరోనా కేసులున్న 10 జిల్లాల్లో రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యే విధిస్తున్నట్లు గురువాం సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. కాగా, యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌ రెండు రోజుల క్రితం క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే.