Amritpal Singh Video: సన్ గ్లాసెస్ పెట్టుకుని, డెనిమ్ జాకెట్ ధరించి ఢిల్లీలో హాయిగా తిరిగిన అమృత్‌పాల్ సింగ్

Amritpal Singh Video: సన్ గ్లాసెస్ పెట్టుకుని, డెనిమ్ జాకెట్ ధరించి ఢిల్లీలో హాయిగా తిరిగిన అమృత్‌పాల్ సింగ్

Amritpal Singh Video

Amritpal Singh Video: పోలీసులకు చిక్కకుండా, వేషాలు మార్చుతూ తిరుగుతున్నాడు పంజాబ్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్. అతడు సన్ గ్లాసెస్ పెట్టుకుని, డెనిమ్ జాకెట్ ధరించి, టర్బన్ లేకుండా ఢిల్లీలో హాయిగా తిరుగుతూ కనపడ్డాడు. కొన్ని రోజుల క్రితం అతడు ఆయా ప్రాంతాల్లో తిరిగిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తాజాగా ఈ దృశ్యాలు బయటకు వచ్చాయి.

పోలీసుల నుంచి తప్పించుకు తిరిగడానికి అతడు వేషం మార్చినట్లు స్పష్టమవుతోంది. అమృత్ పాల్ సింగ్ సహాయకుడు పపల్ ప్రీత్ సింగ్ కూడా సీసీటీవీ క్లిప్ లో కనపడ్డాడు. తమను గుర్తు పట్టకుండా వారిద్దరు మాస్కులు కూడా ధరించారు. పంజాబ్ పోలీసులు మార్చి 18న అతడిని అరెస్టు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. మార్చి 21న ఢిల్లీలో అమృత్ పాల్ సింగ్ తిరిగాడు.

హరియాణాలోని కురుక్షేత్ర నుంచి అమృత్ పాల్ సింగ్ ఢిల్లీకి వచ్చాడు. అతడు ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నాడా? అన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోతున్నారు. అమృత్ పాల్ సింగ్ నేపాల్ కు పారిపోయాడన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారిస్ పంజాబ్ దే చీఫ్ గా కొనసాగుతూ యువతను తన ప్రసంగాలతో అతడు రెచ్చగొడుతున్నాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు, అధికారులు చేస్తోన్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.

Rahul Gandhi: సాక్ష్యాధారాలతో నిరూపించగలరా? రాహుల్ గాంధీకి సావర్కర్ మనవడు సవాల్ ..