Patanjali Head: కొవిడ్‌ సమస్యలతో పతాంజలి డైరీ బిజినెస్ హెడ్ సునీల్ బన్సాల్ మృతి

కొవిడ్‌తో పోరాడి పతాంజలి డైరీ బిజినెస్ హెడ్ సునీల్ బన్సాల్ ప్రాణాలు కోల్పోయారు. 57ఏళ్ల ఆయన కొవిడ్-19తో ఊపిరి తిత్తులు, బ్రెయిన్ హేమరేజ్ అవడంతో మే19న తుది శ్వాస విడిచారు.

Patanjali Head: కొవిడ్‌ సమస్యలతో పతాంజలి డైరీ బిజినెస్ హెడ్ సునీల్ బన్సాల్ మృతి

Patanjali

Patanjali Head: కొవిడ్‌తో పోరాడి పతాంజలి డైరీ బిజినెస్ హెడ్ సునీల్ బన్సాల్ ప్రాణాలు కోల్పోయారు. 57ఏళ్ల ఆయన కొవిడ్-19తో ఊపిరి తిత్తులు, బ్రెయిన్ హేమరేజ్ అవడంతో మే19న తుది శ్వాస విడిచారు. ద ప్రింట్ అనే ఇంగ్లీష్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.

డైరీ సైన్సెస్ లో స్పెషలిష్ట్ అయిన బన్సాల్.. పతాంజలి డైరీ బిజినెస్ లో 2018వ సంవత్సరం ఛార్జ్ తీసుకున్నారు. అప్పుడే కంపెనీ ఆవు పాలు, ఇతర పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ, వెన్నను ప్యాకేజ్డ్ రూపంలో అమ్మే నిర్ణయం తీసుకుంది.

కొద్ది రోజులుగా ఆయన ఈసీఎమ్ఓ మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఈసీఎమ్ఓ అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనరేషన్ అంటే పేషెంట్ గుండె, ఊపిరితిత్తుల పనిని అదే నిర్వర్తిస్తుందన్న మాట. గుండె, ఊపిరితిత్తుల సర్జరీలు సర్జరీ జరిగిన వారికి ఇది అమరుస్తారు.

ఇదిలా ఉంటే, రామ్ దేవ్ అల్లోపతి మెడిసిన్ చేసిన కామెంట్ల తర్వాత బన్సాల్ చనిపోయిన వార్త బయటికొచ్చింది. రామ్ దేవ్ 140సెకన్ల వీడియో క్లిప్ లో అల్లోపతి మెడిసిన్ వాడి లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారంటూ కామెంట్ చేశారు. వాటిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీరియస్ గా తీసుకుంది.

కేంద్రానికి విషయం తెలియజేయడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ వెంటనే కామెంట్లు వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు.

పతాంజలి గతేడాది కూడా కాంట్రవర్సీలో ఇరుక్కుంది. కరోనాకు మందు కనిపెట్టామని కరోనిల్ అనే లేబుల్ తో అమ్మకాలు మొదలుపెట్టింది. దానికంటే ముందు ఇటువంటి ప్రొడక్ట్ మార్కెట్లోకి రాకముందే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని, అవి చూపించి ముందు లైసెన్స్ తీసుకోవాలని ప్భుత్వం ఆదేశించింది.

అప్పటి నుంచి కరోనిల్ మందు లేబుల్ మార్చి కొవిడ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ గా ఇమ్యూనిటీ బూస్టర్ గా అమ్మకాలు జరుపుతున్నారు.