Cyclone Yaas : యాస్ తుపాన్ బీభత్సం, రెండు రాష్ట్రాలు అతలాకుతలం

యాస్ తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ అతలాకుతలం అయ్యాయి. రెండు రాష్ట్ర తీర ప్రాంతాల్లో ఇప్పట్లో కోలుకోలేనంత నష్టాన్ని మిగిల్చింది. తుపాను బీభత్సానికి కోటి మందికి పైగా నష్టపోయారు.

Cyclone Yaas : యాస్ తుపాన్ బీభత్సం, రెండు రాష్ట్రాలు అతలాకుతలం

Yaas

Odisha And West Bengal : యాస్ తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ అతలాకుతలం అయ్యాయి. రెండు రాష్ట్ర తీర ప్రాంతాల్లో ఇప్పట్లో కోలుకోలేనంత నష్టాన్ని మిగిల్చింది. తుపాను బీభత్సానికి కోటి మందికి పైగా నష్టపోయారు. అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గంటకు 150 కిలోమీటర్లతో వీచిన పెనుగాలులు ఒడిశాలోని భద్రక్‌ జిల్లాను అతలాకుతలం చేశాయి. ప్రచండ గాలుల ధాటికి కొన్ని చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరి పడ్డాయి. ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌ తీరంలో సముద్రం బాగా ముందుకొచ్చింది.

వందల గ్రామాలు సముద్రపు నీటిలో చిక్కుకున్నాయి. తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒడిశా, బెంగాల్‌లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఒడిశాలో యాస్​ తుపాన్​ వల్ల 130కి పైగా గ్రామాలు దెబ్బతిన్నాయి. దీంతో వారం పాటు సహాయక చర్యల కార్యక్రమాలు కొనసాగుతాయని సీఎం నవీన్​ పట్నాయక్​ ప్రకటించారు. ఇక ఎటు చూసినా అడుగుల మేర నీరు, బురదతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతోంది. ఇండియన్‌ ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల్లో 113 టీంలను ఎన్డీఆర్​ఎఫ్​ ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జార్ఖండ్‌లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. పిడుగులు ఉరుములతో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో జార్ఖండ్​లో హై అలర్ట్​ ప్రకటించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Read More : Twitter: మా ఉద్యోగుల భద్రత గురించి భయంగా ఉంది – ట్విట్టర్