Three Forces : ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఆర్మీలో ప్రవేశం లేనట్లే..!

ఆందోళనలో పాల్గొని ఎఫ్‌ఐఆర్‌ నమోదైన యువకులను.. ఎట్టి పరిస్థితుల్లో సైన్యంలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. భారత ఆర్మీ పునాదులు క్రమశిక్షణ నుంచే ఏర్పడ్డాయని, ఆస్తుల విధ్వంసానికి తావు లేదన్నారు.

Three Forces : ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఆర్మీలో ప్రవేశం లేనట్లే..!

Army

three forces superiors : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అమవుతున్నాయి. ఈ క్రమంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు అగ్నిపథ్‌ స్కీమ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థలే విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

ఆందోళనలో పాల్గొని ఎఫ్‌ఐఆర్‌ నమోదైన యువకులను.. ఎట్టి పరిస్థితుల్లో సైన్యంలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. భారత ఆర్మీ పునాదులు క్రమశిక్షణ నుంచే ఏర్పడ్డాయని, ఆస్తుల విధ్వంసానికి తావు లేదన్నారు. ప్రతి అభ్యర్థి నిరసనల్లో పాల్గొనలేదని ధ్రువపత్రం సమర్పించాలి ఉంటుందని, అది లేకుంటే ఎవరినీ చేర్చుకునేది లేదన్నారు.

Agnipath : కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్..సాధారణ రిక్రూట్ మెంట్ లేదు : రక్షణ శాఖ

అగ్నిపథ్ పథకం ఇప్పటికిప్పుడు తీసుకువచ్చింది కాదని ప్రకటించాయి. రెండేళ్ల పాటు సమగ్ర అధ్యయనం చేశాకే అగ్నిపథ్‌ను తీసుకొచ్చినట్లు త్రివిధ దళాలు వెల్లడించాయి. 1989నుంచి ఇది పెండింగ్‌లో ఉందని ..వివిధ దేశాల్లో విధానాలను అధ్యయనం చేశాకే దీన్ని తీసుకొచ్చామని తెలిపింది. సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు తీసుకొస్తున్నామని ట్రై ఫోర్స్‌ తెలిపాయి. సగటు వయసు 30ఏళ్లకు పైగా ఉందని ఇది ఆందోళన కలిగించేదే అన్నది సైన్యం వాదన.

యువకులు అయితే సైన్యంలో టెక్నాలజీని సమర్ధంగా వినియోగిస్తారని ఫోన్లు, డ్రోన్లతో అద్భుతాలు చేయగలరని అందుకే యువత సైన్యంలోకి రావడానికి అవకాశాలు పెంచామని తెలిపింది. ఓవైపు యువశక్తి, మరోవైపు అనుభవం మేళవింపులా సైన్యం ఉండేలా అగ్నిపథ్‌ను తీసుకొచ్చామన్నారు మిలటరీ వ్యవహారాల విభాగం అడిషనల్ సెక్రటరీ అనిల్‌ పూరి. అగ్నిపథ్‌ స్కీమ్‌ విషయంలో వెనక్కి తగ్గేదేలేదని ఖరాఖండిగా చెప్పేశారు