UP Rural Polls : యూపీ పంచాయతీ ఓట్ల లెక్కింపు..సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది. కరోనా కేసులు పెరుగుతున్నా..పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టడం కరెక్టు కాదని వ్యాఖ్యానించింది.

UP Rural Polls : యూపీ పంచాయతీ ఓట్ల లెక్కింపు..సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Up Panchayat

Supreme Court : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది. కరోనా కేసులు పెరుగుతున్నా..పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టడం కరెక్టు కాదని వ్యాఖ్యానించింది. ఇప్పుడు లెక్కింపు చేయకుంటే..ఆకాశమేమీ ఊడిపడదంటూ..మండిపడింది. భారతదేశంలో ఎక్కడ చూసినా..కరోనా వైరస్ విస్తరిస్తోందని, ఆక్సిజన్.. బెడ్ల కొరత వేధిస్తోందని, ఇలాంటి సమయంలో ఎన్నికల కౌంటింగ్ నిలుపలేమా ? అని సూటిగా ప్రశ్నించింది.

ఓట్ల లెక్కింపు జరిగితే..దానికి తగ్గట్టు వైద్య సదుపాయాలు కల్పించే శక్తి మీకుందా ? అని యూపీ ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించింది. అసలు ఏ ప్రాతిపదికన ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు ? అని ప్రశ్నించింది. రెండు మూడు వారాల పాటు కౌంటింగ్ ను వాయిదా వేస్తే ఏమవుతుందని నిలదీసింది. 800 కేంద్రాల్లో 2 లక్షల స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ చేస్తామని అంటున్నారని, ఒక్కో సీటులో ఎంత మంది పోటీ చేశారు ? ఒక్క కేంద్రంలో 75 మందినే ఎలా అనుమతినిస్తారు అని ప్రశ్నించింది.

దీనిపై యూపీ అదనపు సొలిసిటర్ జనరల్ భాటీ స్పందించారు. 2021, మే 02వ తేదీ ఆదివారం ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని స్పష్టం చేయడం విశేషం. కౌంటింగ్ కు రెండు, మూడు రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉందని, సోమవారం దీనిపై అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. చివరకు ప్రభుత్వ వాదనను ఆమోదించిన
పేపర్ బ్యాలెట్ తో జరిగిన ఎన్నికలు కాబట్టి.. కౌంటింగ్ కు రెండు మూడు రోజులు పడుతుందని, సోమవారం నాటికి దీనిపై అఫిడవిట్ ను సమర్పిస్తామని చెప్పారు. మంగళవారం ఉదయం 7 గంటల దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. దీంతో చివరకు ప్రభుత్వ వాదనను ఆమోదించిన సుప్రీం కోర్టు కౌంటింగ్ కు ఓకే చెప్పింది.

Read More : Nepal Shuts Border Points : భారత్ కు వెళ్లే 22 రహదారులను మూసేసిన నేపాల్